రికార్డులని మడతపెట్టేస్తున్న మహేష్?

Purushottham Vinay
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్  కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం  సినిమా థియేటర్లలో డిజాస్టర్ టాక్ తోనే 250 కోట్ల దాకా వసూలు చేసి ఫైనల్ రన్ లో యావరేజ్ హిట్ అయింది. కానీ ఓటిటి,బుల్లితెరపై మాత్రం ఈ సినిమా మంచి వ్యూస్ ని ఇంకా రేటింగ్ ను సొంతం చేసుకొని మొత్తానికి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. సినిమా కంటెంట్ యావరేజ్ గా ఉన్నా మహేష్ పెర్ఫార్మన్స్ మాత్రం సూపర్ గా ఉండటం వల్ల ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని బాగా చూశారు. ఫస్ట్ డే భారీ నెగటివిటీతో డిజాస్టర్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఫైనల్ రన్ లో 250 కోట్లు వసూళ్లు చేసి యావరేజ్ హిట్టుగా నిలిచింది. ఇది పూర్తిగా సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ కి నిదర్శనం.ఈ సినిమా బుల్లితెరపై ప్రసారమైన తర్వాత కూడా మహేష్ బాబు ఖాతాలో సరికొత్త రికార్డులు చేరుతున్నాయి. తాజాగా ఈ సినిమాలోని కుర్చీ మడతబెట్టి సాంగ్ యూట్యూబ్ లో 200 మిలియన్ల పైగా వ్యూస్ తో అరుదైన రికార్డ్ ను చేరుకుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకున్న సెకండ్ సాంగ్ గా ఈ పాట నిలిచింది.


మహేష్ కెరీర్ లో ఎక్కువ వ్యూస్ సాధించిన మొదటి సాంగ్ సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్ కాగా ఆ సాంగ్ కు ఏకంగా 245 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అయితే కుర్చీ మడతబెట్టి సాంగ్ రాబోయే రోజుల్లో ఈ రికార్డ్ ను కూడా బ్రేక్ చేసే ఛాన్స్  ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక ఈ పాట మహేష్ కెరీర్ లోనే ఫాస్ట్ గా 200 మిలియన్ వ్యూస్ రాబట్టిన పాటగా నిలిచింది.టాలీవుడ్ ఫాస్ట్ గా ఈ రికార్డు కొట్టిన రెండవ పాటగా నిలిచింది. 68 రోజుల్లో 200 మిలియన్ వ్యూస్ రాబట్టి ఫస్ట్ ప్లేసులో ఊ అంటావా సాంగ్ ఉండగా సెకండ్ ప్లేసులో కుర్చీ మడతపెట్టి ఉంది. ఈ పాట 78 రోజుల్లో ఈ రికార్డ్ కొట్టింది. మూడో స్థానంలో బుట్టబొమ్మ 95 రోజుల్లో ఈ రికార్డ్ అందుకుంది.ఇలా మహేష్ బాబు  సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండటం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. ఒక సాంగ్ కు దాదాపుగా 20 కోట్ల వ్యూస్ రావడం సులువు కాదని అసలు ఒక్క పాన్ ఇండియా సినిమాలో నటించకుండానే మహేష్ ఈ స్థాయిలో రికార్డ్స్ సాధిస్తే రాజమౌళి సినిమాతో మహేష్ ఏ స్థాయిలో రికార్డ్స్ సాధిస్తారో అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి అరుదైన రికార్డ్స్ మహేష్ కు మాత్రమే సాధ్యమనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: