"RAPO" అభిమానులకు గుడ్ న్యూస్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒకరు. ఈయన కెరియర్ ను మొదలు పెట్టిన మొదటి సినిమా అయినటువంటి దేవదాస్ తోనే అద్భుతమైన కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు రామ్ చాలా విజయాలను అందుకున్నప్పటికీ ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంలో చాలా వెనకబడిపోయాడు.

కొంత కాలం క్రితం ఈ నటుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ అనే సినిమాలో హీరోగా నటించి సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఈ మూవీ.లో నిధి అగర్వాల్ , నబా నాటేష్ హీరోయిన్ లుగా నటించగా ... మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఈ మూవీ కి సీక్వెల్ గా డబల్ ఈస్మార్ట్ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు.

ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. కాకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేయడం లేదు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మే నెలలో రామ్ పుట్టిన రోజు ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ ను కానీ ఫస్ట్ సింగిల్ కానీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో వరుస అపజాయలను ఎదుర్కొంటున్న రామ్ డబుల్ ఈస్మార్ట్ మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: