ఆ రేర్ మార్క్ వ్యూస్ ను టచ్ చేసిన మహేష్ "కుర్చీ మడత పెట్టి" సాంగ్..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు కొంత కాలం క్రితమే గుంటూరు కారం అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఫుల్ క్రేజ్ కలిగిన హీరోయిన్ లుగా కెరియర్ ను కొనసాగిస్తున్న శ్రీ లీలా , మీనాక్షి చౌదరి ... మహేష్ కు జోడిగా నటించగా ... టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. జయరామ్ , రమ్యకృష్ణ , రావు రమేష్ , ప్రకాష్ రాజ్ , రాహుల్ రవీంద్రన్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... చినబాబు , సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించారు.

ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదల కంటే ముందే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేసింది. అందులో కూర్చి మడత పెట్టి అంటూ సాగే సాంగ్ సినిమా విడుదలకు ముందే అద్భుతమైన ఫేమస్ అయ్యింది. ఇక సినిమా విడుదల అయిన తర్వాత ఈ పాటలో మహేష్ , శ్రీ లీల వేసిన డాన్స్ స్టెప్ లు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సాంగ్ మరింత ఫేమస్ అయ్యింది.

ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ లోని కుర్చీ మడత పెట్టి అంటూ సాగే వీడియో సాంగ్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు. దీనికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. తాజాగా ఈ వీడియో సాంగ్ ఓ రేర్ మార్క్ వ్యూస్ ను టచ్ చేసింది. ఇప్పటి వరకు ఈ సాంగ్ కి యూట్యూబ్ లో 200 ప్లస్ మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇలా కుర్చీ మడత పెట్టి సాంగ్ యూట్యూబ్ లో ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: