రణవీర్, దీపిక పెళ్లికి కారణం నేనే.. నాకు థాంక్స్ చెప్పాలి : కరీనా

praveen
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది హీరో హీరోయిన్లు కొన్నెళ్లపాటు ప్రేమలో మునిగి తేలి ఆ తర్వాత పెళ్లితో ఒకటవుతున్నారు. ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ గా పేరు సంపాదించుకుంటున్నారు. ఇలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని ప్రేక్షకులకు ఫేవరెట్ జోడిగా మారిపోయిన వారిలో  రణబీర్ దీపిక పదుకొనే జంట కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే.

 ఎన్నో ఏళ్లపాటు ప్రేమలో మునిగితేలుతూ.. చెట్టా పట్టాలేసుకుని తిరిగిన ఈ జంట.. తర్వాత పెళ్లితో తమ ప్రేమకు ప్రమోషన్ ఇచ్చేశారు. ఇక అభిమానులు అందరూ కూడా ఈ జంటను దీప్ వీర్ అనే ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఈ ఇద్దరి జంట ఏ సినిమా ఈవెంట్లో కనిపించిన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉంటారు. అయితే రణబీర్, దీపిక పదుకొనే మొదటిసారి కలిసిన రామ్ లీలా సినిమాలో ఈ మూవీలోని ఇద్దరు కలిసి నటించగా.. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిపోయింది. అయితే ఇలా ప్రేమ పెళ్లి చేసుకున్న రణబీర్, దీపిక పదుకొనే తనకు థాంక్స్ చెప్పాలి అంటూ ఇటీవల  మరో హీరోయిన్ కరీనాకపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

 రామ్ లీలా సినిమాలో ఫస్ట్ చాన్స్ నాకే వచ్చింది. కానీ అప్పుడు బిజీగా ఉండడం కారణంగా నేను ఆ సినిమా చేయలేకపోయాను. అయితే నేను ఈ సినిమా వదులుకోవడంతోనే ఆ మూవీలో రణబీర్ సరసన దీపిక పదుకొనే నటించేందుకు ఛాన్స్ దక్కించుకుంది. ఇక అప్పుడే వారి మధ్య ఏర్పడిన పరిచయం  పెళ్లి చేసుకునేంతవరకు వెళ్ళింది. ఒకరకంగా చూస్తే వాళ్లు కలవడానికి కారణం నేనే. అందుకే వాళ్ళు నాకు థాంక్స్ చెప్పాల్సిందే అంటూ కరీనాకపూర్ కామెంట్స్ చేసింది. అదే సమయంలో సైఫ్ అలీఖాన్ తో కహో నహో సినిమాను రిజెక్ట్ చేసానని.. ఆ మూవీ ఓకే చెప్పి ఉంటే తమ పెళ్ళి కాస్త ముందుగానే జరిగేది అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: