మ్యాడ్ స్క్వేర్ మొదలు పెట్టిన టిల్లు స్క్వేర్ మేకర్స్..!!

murali krishna
ఇటీవల బ్లాక్ బస్టర్ మూవీ డీజే టిల్లూ మూవీకి సీక్వెల్ గా టిల్లూ స్కేర్ మూవీతో వచ్చి హీరో సిద్దూ జొన్నలగడ్డ డబల్ ఫన్ అందించాడు.ఇప్పుడు టిల్లు స్క్వేర్ మూవీ మూవీ మేకర్సే తమ మరో హిట్ సినిమా మ్యాడ్ కు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకు మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసారు.. గతేడాది రిలీజైన మ్యాడ్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.టిల్లూ స్క్వేర్ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.ఈ మూవిని సితార ఎంటర్‌టైన్మెంట్స్ తెరకెక్కించారు.ఇప్పుడదే ఊపులో మరో సినిమా సీక్వెల్ అనౌన్స్ చేశారు. టైటిల్ కలిసి రావడంతో ఈ కొత్త సీక్వెల్ కు కూడా మ్యాడ్ స్క్వేర్ అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.గతేడాది అక్టోబర్ లో రిలీజైన మ్యాడ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభించింది.టిల్లూ స్క్వేర్ లాగే మ్యాడ్ స్క్వేర్ కూడా సూపర్ సక్సెస్ అందుకుంటుంది ఆశతో మేకర్స్ ఉన్నారు.  

డీజే టిల్లూ రిలీజైన రెండేళ్లకు టిల్లూ స్క్వేర్ సినిమా వచ్చింది. అయితే గత సెప్టెంబర్ నుంచి టిల్లు స్క్వేర్ వాయిదా పడుతూ వచ్చింది. దీనితో టిల్లు స్క్వేర్ సక్సెస్ అవుతుందా అనే అనుమానం వచ్చింది... అయితే టిల్లూ గాడు ఈసారి కూడా బాక్సాఫీస్ కలెక్షన్స్ గట్టిగానే కొట్టాడు రూ.130 కోట్ల వరకూ టిల్లు స్క్వేర్ మూవీ కలెక్ట్ చేసింది...టిల్లు స్క్వేర్ మూవీ సిద్దూ జొన్నలగడ్డ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇదే తరహాలో మ్యాడ్ మూవీకి కూడా సీక్వెల్ తీసుకురావాలన్న ఆలోచనను మేకర్స్ కు కలిగింది.మ్యాడ్ సినిమా థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా సూపర్ సక్సెస్ అయింది.ఈ మూవీలో నార్నె నితిన్ మరియు సంగీత్ శోభన్ నటించారు.గతేడాది అక్టోబర్ లో ఈ మ్యాడ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మ్యాడ్ సినిమా రెండు గంటల పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ.. థియేటర్లలో రిలీజైన నెల రోజులకు నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది.ఓటీటీలోకూడా ఈ మూవీ టాప్ ట్రెండింగ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.. మరి సీక్వెల్ గా వస్తున్న మ్యాడ్ స్క్వేర్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: