అఫీషియల్ : ఐదు భాషల్లో "టిల్లు స్క్వేర్"..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ తాజాగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన టిల్లు స్క్వేర్ అనే పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాకి డీజే టిల్లు కి సీక్వల్  రూపొందడంతో మొదటి నుండి ఈ మూవీ పై టాలీవుడ్ ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ మార్చి 29 వ తేదీన విడుదల అయిన టిల్లు స్పేర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది.
 

ప్పటి వరకు 20 రోజుల బాక్స్ ఆఫీస్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 125 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టి ఈ సంవత్సరం అదిరిపోయే లాభాలను అందుకున్న సినిమాల లిస్టులో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇకపోతే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో తన నటనతో మాత్రమే కాకుండా ఈ బ్యూటీ అంతకుమించిన అందాల ప్రదర్శనతో కూడా కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశం నిర్మించాడు.

ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా త్వరలోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఏప్రిల్ 26 వ తేదీ నుండి తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sj

సంబంధిత వార్తలు: