"జెర్సీ" రీ రిలీజ్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కొంత కాలం క్రితం జెర్సీ అనే క్రికెట్ క్రీడా నేపథ్యంలో ఓ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ నీ సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే ఈ మూవీ లో నాని నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.
 

ఇలా ఆ సమయం లో సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్ లను ఈ మూవీ యూనిట్ ఓపెన్ చేసింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఇకపోతే ఇప్పటికే అనేక తెలుగు సినిమాలు రీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబట్టాయి.

మరి జెర్సీ మూవీ ఏ స్థాయి కలెక్షన్ లను రీ రిలీజ్ లో భాగంగా రాబడుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా టాలీవుడ్ లో మంచి విజయం సాధించడంతో ఈ సినిమాను ఇదే పేరుతో షాహిద్ కపూర్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హిందీ లో రీమేక్ చేశాడు. కాకపోతే ఈ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: