తేజా సజ్జా మూవీకి చారిత్రిక నేపధ్యం !

Seetha Sailaja
హనుమాన్’ మూవీతో ఈ సంవత్సరం సంక్రాంతి రేస్ లో సంచలనాలు సృష్టించిన తేజ్ సజ్జా కు అనేక ఆఫర్లు వచ్చినప్పటికీ అన్ని సినిమాలు ఓకె చెప్పకుండా ఒక చారిత్రిక నేపధ్యం ఉన్న ఒక భారీ సినిమాకు ఓకె చేసి మరొకసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. ‘సూర్య వర్సస్ సూర్య’ ‘ఈగల్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈమూవీని ఈ యంగ్ హీరో చేస్తున్నాడు.

ఎప్పటి నుంచో ఈసినిమాకు సంబంధించి ప్రచారంలో ఉన్న ‘మిరాయ్’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేసి ఈసినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఒక యోధుడి గొప్ప సాహసం అంటూ ఈమూవీ ప్రీ లుక్ పోస్టర్ పై అందరి దృష్టిని ఆకర్షించాడు. పాన్ ఇండియా మూవీగా టూడీ త్రీడీ లలో కూడ ఈమూవీ ఒకేసారి విడుదల కావడమే కాకుండా దక్షిణాది భాషలు అన్నింటిలోకి ఈమూవీని డబ్ చేయబోతున్నారు.

‘మిరాయ్’ అంటే ఒక యోధుడు అని అర్థం. మౌర్య సామ్రాజ్య అధినేత అశోకుడు కళింగ ముద్ధం తరువాత యోగిగా మారిపోయినట్లుచరిత్రకారులు చెపుతారు. అశోకుడు ని యోగిగా మార్చే విషయంలో ఒక గ్రంధం అశోకుడి మనస్తత్వం పై ప్రభావం చూపెడుతుంది. అయితే కొన్ని వందల సంవత్సరాలు తరువాత ఆ గ్రంధం కొందరు దుష్టుల చేతిలో పడినప్పుడు యోధుడైన మిరాయ్ ఆ గరంధాన్ని ఎలా రక్షించాడు అన్న పాయింట్ చుట్టూ ఈమూవీ కథ నడుస్తుందని  తెలుస్తోంది. ఈసినిమాకు సంబంధించి కార్తీక్ ఘట్టమనేని విడుదల చేసిన ఈ ఫస్ట్ ప్రీలుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

రితీకా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరం సమ్మర్ రేస్ కు విడుదల అయ్యేలా ఈమూవీని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంచనాలకు అనుగుణంగా ఈమూవీ విజయాన్ని సాధించ గలిగితే తేజ్ సజ్జా కెరియర్ మరొక మెట్టు ఎక్కే ఆస్కారం ఉంది..మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: