ఆ సినిమా ప్లాప్ అయితే విజయ్ కెరీర్ పోయినట్టే?

Purushottham Vinay
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి ఇంకా గీతాగోవిందం సినిమాలతో  భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండ తరువాత టాక్సీవాలాతో కూడా మరో హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ నాలుగు సినిమాలు విజయ్ దేవరకొండ ఇమేజ్ ని ఒక రేంజ్ లో పెంచేసాయి. టైర్ 2 హీరో రేంజ్ కి ఈ సినిమాలు తీసుకొని వెళ్లాయి. అయితే ఆ తరువాత అతని సినిమాలు ఆడియన్స్ ని మెప్పించడంలో అంతగా క్లిక్  అవ్వలేదు. అయితే పాపం యాక్టర్ గా అతని ఫెయిల్యూర్ ఎక్కడా లేదు. కేవలం అతని దర్శకులు సిద్ధం చేస్తోన్న కథలు ప్రేక్షకులకి నచ్చడం లేదు. పైగా అతని ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అతనికి ప్లాపులు తెచ్చిపెడుతుంది. అయితే డియర్ కామ్రేడ్ సినిమా పరవాలేదు అనే టాక్ అందుకున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా క్లిక్ కాలేదు. దానికి కారణం విజయ్ చేసిన అతే. గీతా గోవిందం దాకా ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా హిట్లు కొట్టే విజయ్ ఆ సినిమా తర్వాత తను చేసి పనుల వల్ల కూడా ప్లాపులు ఎదురుకుంటున్నాడు. ప్రమోషన్స్ లో ఓవర్ చెయ్యడం వల్ల బాగా నెగటివిటీని దక్కించుకున్నాడు.


వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, వరుసగా డిజాస్టర్ అయ్యాయి. గత సంవత్సరం ఖుషి సినిమాతో విజయ్ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది కానీ పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో బిజినెస్ పరంగా నిర్మాతలు నష్టపోయారు. ఇక తాజాగా పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమాతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాపై రిలీజ్ కి ముందు మంచి పాజిటివ్ బజ్ అనేది క్రియేట్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా తీసి హిట్టు కొట్టడం వల్ల డైరెక్టర్ పరశురామ్ పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలే ఫ్యామిలీ స్టార్ కొంపముంచాయి.చిత్ర యూనిట్ కూడా సినిమాపై ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా సైలెంట్ అయిపొయింది. దీనిని బట్టి ఈ సినిమా ఏ స్థాయిలో నష్టాలను కలిగిస్తుంది అనేది మరికొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో విజయ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిన విజయ్ కెరియర్ ని మళ్ళీ గాడిలో పెడుతుందేమో  చూడాలి. అప్పుడే ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ నిన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: