తేజ నెక్స్ట్ మూవీ మాములుగా లేదుగా..?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తన క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. అందుకే.. ఈ హీరో చేస్తున్న తరువాతి సినిమాలపై కూడా ఇప్పుడు మంచి బజ్ క్రియేట్ అవుతోంది.తేజ హనుమాన్ సినిమా లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఎలాంటి సినిమా చేయనున్నాడు అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.అయితే రీసెంట్ గా ఈగల్ సినిమాతో  ఆకట్టుకున్న దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో తేజ సజ్జ తరువాత సినిమా చేయనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాకు సంబందించిన కథా చర్చలు కూడా ఇప్పటికే జరిగాయని సమాచారం తెలుస్తుంది.తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్,ఫస్ట్ లుక్ రిలీజ్‍కు డేట్ ఖరారైంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నట్టు అఫిసియల్ ప్రకటన చేసింది.ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇదేరోజు రానుంది. 'సూపర్ యోధ అడ్వెంచరస్ సాగా' అనే ట్యాగ్ తో తేజ ఉన్న పోస్టర్ ని పోస్ట్ చేసింది. అయితే, ఈ సినిమాకు సూపర్ యోధ అనే టైటిల్ ఉంటుందా..వేరేది ఏమైనా ప్రకటిస్తారా అనేది మాత్రం చూడాలి.


ఇక ఈ సినిమాకు మిరాయ్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లు సమాచారం తెలుస్తోంది.ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్‍గా నటించనున్నారని టాక్. ఇంకా అలాగే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ మూవీపై హై లెవల్ బజ్ క్రియేట్ అయింది.ఇక ఈ మూవీ కోసం మేకర్స్ ఏకంగా రూ.40 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడానికి రెడీ అవుతున్నారని సమాచారం తెలుస్తుంది. ఇది తెలిసిన నెటిజన్స్ అందరూ తెగ షాకవుతున్నారు. నిన్నమొన్నటి వరకు కోటి, రెండు కోట్లలో మాత్రమే సినిమాలు చేసిన తేజ..హనుమాన్ సక్సెస్ తో ఏకంగా రూ.40 కోట్ల రేంజ్ కి చేరిపోయాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా హిట్ అయింది అంటే తేజ సజ్జను ఆపడం ఎవరి తరం కాదనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి చూడాలి ఇక ఈ మూవీతో యంగ్ హీరో తేజ సజ్జ ఎలాంటి హిట్ ని అందుకుంటాడో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: