"ప్రతినిధి 2" ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ... సమయం ఫిక్స్..!

MADDIBOINA AJAY KUMAR
సోలో , ప్రతినిధి మూవీలతో తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి నారా రోహిత్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన కొంత కాలం క్రితం ప్రతినిధి అనే పొలిటికల్ అంశాలతో రూపొందిన సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.  శుభ్ర అయ్యప్ప , శ్రీవిష్ణు ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా... ప్రతాప్ మండల ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
 

2014 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని మంచి విజయం సాధించింది.  ప్రతినిధి మూవీ ఆ టైంలో మంచి విజయం ప్రేక్షకులను బాగా అలరించడంతో ఈ నటుడు తాజాగా "ప్రతినిధి 2" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాకి మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహించాడు. ఈ మూవీని ఏప్రిల్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమాలోని మొదటి సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది.

ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమాలోని మొదటి సాంగ్ అయినటువంటి "గల్ల ఎత్తి" అంటూ సాగే సాంగ్ ను రేపు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లో నారా రోహిత్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో డాన్స్ స్టెప్ వేస్తూ ఉన్నాడు. మరి "ప్రతినిధి" మూవీతో మంచి విజయాన్ని అందుకున్న ఈ నటుడు "ప్రతినిధి 2" మూవీతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

nr

సంబంధిత వార్తలు: