హీరోలు నాతో నటించడానికి అందుకే ఇష్టపడరు... విద్యాబాలన్..!

MADDIBOINA AJAY KUMAR
బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి మనులలో విద్యా బాలన్ ఒకరు . ఈమె కెరియర్ ప్రారంభంలో కమర్షియల్ సినిమాలలో నటించినప్పటికీ ఆ తర్వాత కాలంలో మాత్రం ఈమె కమర్షియల్ సినిమాలకు చాలా దూరంగా ఉంటూ ఎక్కువ శాతం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ వస్తుంది . అందులో భాగంగా ఇప్పటికే ఈమె అనేక లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ప్రధాన పాత్రలో నటించింది.

అందులో కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి . ఈమె ప్రధాన పాత్రలో రూపొందిన డర్టీ పిక్చర్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ఇండియా వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ఈమెకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా ఈమె తనతో హీరోలు ఎందుకు నటించరు అనే విషయాన్ని చెప్పుకొచ్చింది. తాజాగా విద్యా బాలన్ మాట్లాడుతూ ... లేడీ ఓరియంటెడ్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు అని వాటిని కొందరు నటులు ఏ మాత్రం సహించుకోలేరు అని ఈమె చెప్పుకొచ్చింది. నేను నా కెరీర్ లో ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశాను.

దాని వలన నాతో నటించేందుకు హీరోలు ఎక్కువగా ఇష్టపడరు అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. అలాగే ఇండస్ట్రీ లో బంధు ప్రీతి ఉంటుందనే ప్రచారాన్ని ఆమె కొట్టి పారేశారు. అలా అయితే స్టార్ కిడ్స్ అందరూ సూపర్ సక్సెస్ అయ్యే వారే కదా..? అలా అందరూ ఎందుకు కాలేదు అని అంది. ఇక తన నటన వాళ్లే ఇప్పటికి నాకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి అని ... నేపథ్యం చూసి కాదు అని విద్యా బాలన్ స్పష్టం చేసింది. ఇకపోతే ప్రస్తుతం కూడా విద్యా బాలన్ చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vb

సంబంధిత వార్తలు: