వారంతా చిరంజీవిని ఎందుకు కలిశారో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి మని త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ...  మల్లాడి వశిష్ట ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని క్రియేషన్స్ యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ జరుగుతుంది.

ఇందులో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొంటున్నాడు. ఇక తాజాగా విశ్వంభర సినిమా షూటింగ్ లో చిరంజీవి పాల్గొంటున్న ప్రదేశానికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన దర్శకులు అయినటువంటి అనుదీప్ కే వి ,  మెహర్ రమేష్ , సాయి రాజేష్ ,  శ్రీరామ్ ఆదిత్య వచ్చారు. అలాగే చిరంజీవి ని కలిసి ఆయన తో ఫోటో కూడా దిగారు. అనంతరం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇకపోతే తాజాగా వీరంతా చిరంజీవి ని ఎందుకు కలిశారు అనే విషయం బయటకు వచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... మే 4 వ తేదీన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ డే. కావున ఈ సందర్భంగా హైదరాబాద్ ఎల్ బీ స్టేడియంలో ఓ భారీ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. దానితో చిరంజీవి ని ఆ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రమ్మనడం కోసం అని ఈ దర్శకులు అంతా కలిసి వెళ్లి చిరంజీవి ని కలిశారు. దానితో సానుకూలంగా స్పందించిన చిరంజీవి కూడా ఆ రోజు జరగబోయే డైరెక్టర్ ల డే ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రావడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: