రాఘవ లారెన్స్ "హంటర్" విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలకు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా వివరించిన రాఘవ లారెన్స్ ఆ తర్వాత సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు. అలా డ్యాన్స్ , నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈయన ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను కూడా దక్కించుకున్నాడు. ఒక వైపు సినిమా పాటలకు డాన్స్ కొరియోగ్రఫీ చేస్తూనే ... మరో వైపు సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఈయన ఆ తర్వాతి కాలంలో సినిమాలకు దర్శకత్వం కూడా వహించడం మొదలు పెట్టాడు. ఇలా మూడు రంగాలలో కూడా ఈయన సక్సెస్ అయ్యాడు.
 

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం ఈయన సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఈయన ఓ క్రేజీ మూవీ ని ఓకే చేశాడు. తాజాగా రాఘవ లారెన్స్ "హంటర్" అనే ఓ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను విడుదల చేశారు. ఈ మూవీ కి వెంకట్ మోహన్ రచన మరియు దర్శకత్వం వహించనుండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న లోకేష్ కనకరాజు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్ ను కూడా తాజాగా విడుదల చేశారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్ లు అన్ని కూడా డిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ పై ఇప్పటి నుండే కొంత మంది సినీ ప్రేమికుడు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: