"ది గోట్ లైఫ్" మూవీకి 16 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
మాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి బ్లేస్సి దర్శకత్వం వహించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే మలయాళం తో పాటు తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యింది. ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది.

అలా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ దక్కింది. దానితో ఈ మూవీ ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించిన 16 రోజుల బాక్సాఫీస్ రన్ వరల్డ్ వైడ్ గా కంప్లీట్ అయ్యింది. అందులో భాగంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి 16 రోజులకు గాను కేరళ ఏరియాలో 61.65 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 16 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలలో 2.50 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 16 రోజులకు గాను తమిళ నాడు ఏరియాలో 7.55 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 16 రోజులకు గాను కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియాలో 9.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 16 రోజులకు గాను ఓవర్ సీస్ లో 54.05 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 16 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 60.70 కోట్ల షేర్ ... 134.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ps

సంబంధిత వార్తలు: