డైరెక్టర్స్ కి అనుష్క కొత్త రూల్.. ఇకపై అలాంటి పాత్రల్లో చూడలేం?

praveen
సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న అనుష్క శెట్టి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు  ఇక అభిమానులు అందరూ ఈమెను ఎంతో క్యూట్గా స్వీటీ శెట్టి అని పిలుచుకుంటూ ఉంటారు. సూపర్ అనే సినిమాతో నాగార్జునతో జోడి కట్టి టాలీవుడ్లోకి హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది. ఇక దాదాపు దశాబ్ద కాలానికి పైగానే ఇండస్ట్రీలో అగ్రతారగా హవా నడిపించింది.

 అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి లేడీ క్వీన్ అనే ప్రత్యేకమైన బిరుదును కూడా సంపాదించుకుంది అనుష్క. కానీ సైజ్ జీరోసినిమా కోసం అనుష్క చేసిన ప్రయోగంతో ఇక ఆమె కెరియర్ ఒక్కసారిగా డౌన్ అయింది. ఈ సినిమా కోసం లావు పెరిగిపోవడంతో అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత లావు తగ్గడానికి ఎంతో కష్టపడింది. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం పెద్దగా సినిమాలు చేయట్లేదు. అడపాదడప సినిమాలు మాత్రమే చేస్తూ వస్తుంది. అయితే మొన్నటికి మొన్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ చెట్టి మిస్టర్ కొన్ని శెట్టి అనే సినిమా చేయగా ఇది సక్సెస్ అయింది. మళ్ళీ కెరియర్ లో బిజీగా మారడానికి స్వీటీ శెట్టి సిద్ధమైందట.

 ఇక ప్రస్తుతం ఘాటి అనే సినిమాలో నటిస్తోంది అన్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ గా ఈ మూవీ తెరకెక్కుతూ ఉండడం గమనార్హం. మరోవైపు మలయాళంలో కూడా ఒక సినిమాను సైన్ చేసిందట. ఈ క్రమంలోనే ప్రస్తుతం తన దగ్గరికి కథలతో వస్తున్న డైరెక్టర్లకు అనుష్క ఒక కండిషన్ పెడుతుండట. ఇకపై ఆమె కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే నటించాలని డిసైడ్ అయ్యిందట. హీరోకి జోడిగా చేయడానికి నో చెబుతుందట. తనే లీడ్ గా ఉండే సినిమాలకే ఓకే అంటుంది. ఎవరైనా దర్శకులు తన దగ్గరికి వస్తే అలాంటి కథలతోనే రావాలని కండిషన్ పెడుతుందట. దీంతో ఇక రానున్న రోజుల్లో ఒకప్పటిలా గ్లామర్ వలకబోసే పాత్రల్లో లేదంటే హీరోల తరఫున రొమాంటిక్ సన్నివేశాలలో కూడా ఇక స్వీటీ శెట్టి నటించడం కష్టమే అని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: