దిల్ రాజ్ సమయస్పూర్తి పై ప్రశంసలు !

Seetha Sailaja
ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఎన్నో ఆశలు పెట్టుకుని నిర్మించిన ఫ్యామిలీ స్టార్ మూవీ పై 45 కోట్లు బిజినెస్ జరిగిందని వార్తలు వచ్చాయి. వరస ఫ్లాప్ ల మధ్య విజయ్ దేవరకొండ కొనసాగుతున్నప్పటికీ అతడి పై ఉన్న క్రేజ్ తో ఈ మూవీకి ఈ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఉగాది ని టార్గెట్ చేస్తూ విడడుదలైన ఈ సినిమా వరసపెట్టి సెలవులు వచ్చినప్పటికీ కలక్షన్స్ పరంగా నిలదొక్కుకోలేకపోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.

ఈమధ్య కాలంలో ఏసీనిమా పై జరగాని రీతిలో ఈ మూవీ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరిగింది. ఈ నెగిటివ్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని స్వయంగా దిల్ రాజ్ యాంకర్ గా మారి డీయేటర్లకు వెళ్ళి అక్కడి ప్రేక్షకులను ఇంటర్వ్యూ చేసినప్పటికీ ఈ సినిమా అసలు ఎందుకు ఫెయిల్ అయిందో దిల్ రాజ్ కు కూడ అర్థం కాలేదు అని అంటారు. ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది అని భావించే దిల్ రాజ్ నమ్మకాన్ని కూడ ఈ సినిమా నిలబెట్టలేకపోయింది.

అయితే ఈ సినిమా విషయంలో దిల్ రాజ్ వ్యవహరించిన నిజాయితీకి ఇండస్ట్రీలో చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. టాప్ హీరోల సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమాలు హిట్ అంటూ ఫెక్ కలక్షన్స్ ఫిగర్స్ ప్రచారంలోకి తీసుకు రావడమే కాకుండా ఆసినిమాకు సక్సస్ మీట్ లు పెట్టి చాలామంది చేస్తున్న హడావిడి పై అనేక జోక్స్ వస్తున్నాయి.

అలాంటి పరిస్థితి తనకు ఏర్పడకుండా తన సినిమా అంచనాలకు అనుగుణంగా హిట్ కానప్పటికీ హుందాగా ఈ మూవీ ఫైయిల్యూర్ ను పరోక్షంగా అంగీకరించడం దిల్ రాజ్ నిజాయితీకి నిదర్శనం అంటూ ఇండస్ట్రీలోని కొందరు అతడి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీ పరిస్థితి ఇలా ఉండటంతో ఈ వరస సెలవులలో సినిమాలకు వెళ్ళాలి అన్న ఆలోచన ఉన్నవారికి ‘టిల్లు స్క్వేర్’ ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాలకు అదృష్టంగా మారింది..    మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: