మినీ స్టార్ పై మెగా స్టార్ ప్రశంసల వర్షం !

Seetha Sailaja
సంక్రాంతి రేస్ లో బడా సినిమాల మధ్య విడుదలైన ‘హనుమాన్’ ఘనవిజయం సాధించడంతో ఓవర్ నైట్ లో యంగ్ హీరో తేజ్ సజ్జా క్రేజీ హీరోగా మారిపోయాడు. వాస్తవానికి ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు పేరు వచ్చి క్రేజ్ ఏర్పడుతుందో తలలు పండినవారికి కూడ తెలియదు. ఆ క్రేజ్ ను తెలివిగా నిలబెట్టుకుని వరసపెట్టి మంచి సినిమాలు చేయగలిగిన నటీనటులు మాత్రమే ఇండస్ట్రీలో నిలబడగలుగుతారు.

ఇప్పుడు యంగ్ హీరో తేజ్ సజ్జా పరిస్థితి కూడ అలాంటిదే అని అనిపిస్తోంది. ప్రస్తుతం అతడికి వరసపెట్టి అవకాశాలు వస్తున్నప్పటికీ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోకుండా మంచి సినిమాలు తీయగల దర్శక నిర్మాతల కోసం తేజ్ సజ్జా వేచి చూస్తున్నాడు అన్నవార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితులలో ఈమధ్య జరిగిన ‘ఆహా’ ‘పీపుల్స్’ మీడియా ఫ్యాక్టరీ ఆద్వర్యంలో జరిగిన సౌత్ ఇండియన్ ఫిలిమ్ ఫెస్టివల్ కు అతిధిగా వచ్చిన చిరంజీవి తేజ్ సజ్జా పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

తనకు ఎప్పటి నుంచో ఇష్ట దైవం అయిన ‘హనుమంతుడు’ పై ఒక సినిమా చేయాలని కోరిక ఉండేదని అయితే తన కోరిక తీరకుండానే తేజ్ సజ్జా ‘హనుమాన్’ మూవీని చేసి ఘనవిజయం సాధించడం తనకెంతో ఆనందంగా ఉంది అంటూ కామెంట్స్ చేశాడు. అంతేకాదు తాను నటించిన ‘ఇంద్ర’ ‘చూడాలని ఉంది’ సినిమాలలో తనతో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ్ సజ్జా ఇప్పుడు కేవలం ఒకేఒక్క సినిమాతో క్రేజీ హీరోగా మారడం తనకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ ఈ యంగ్ హీరోని మెగా స్టార్ ఆకాశానికి ఎత్తేశాడు.

‘హనుమాన్’ సూపర్ సక్సస్ తరువాత సోషల్ మీడియాలో తేజ్ సజ్జాకు ‘మినీ స్టార్’ అంటూ ఒక కొత్త ట్యాగ్ ను ఈ యంగ్ హీరోకు నెటిజన్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ మినీ స్టార్ కు ఏకంగా మెగా స్టార్ ప్రశంసలు లభించడంతో అతడి కెరియర్ గ్రాఫ్ మరింత పెరిగింది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: