అఫిషియల్ : "లోకేష్ కనకరాజు" సినిమాలో "రాఘవ లారెన్స్"..!

MADDIBOINA AJAY KUMAR
ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు తాజాగా తన తదుపరి మూవీ కి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు. ఇక తాజాగా వచ్చిన అప్డేట్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందబోయే మూవీకి సంబంధించింది కాదు. ఇది ఈయన నిర్మాణంలో రూపొందబోయే సినిమాది. లోకేష్ నిర్మించబోయే సినిమాలో రాఘవా లారెన్స్ హీరో గా నటించిబోతున్నాడు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టైటిల్ ని కూడా విడుదల చేసింది. ఈ మూవీ కి "బెంజ్" అనే టైటిల్ ను ఖరారు ఖేస్తు ఈ మూవీ యూనిట్ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ మూవీ కి లోకేష్ కనకరాజు కథను అందించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర లాంటిది ఏమీ ఉండదు అని సమాచారం. ఈ సినిమాకు భాగ్యరాజ్ కన్నన్ డైరెక్టర్ గా వ్యవహరించబోతున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం లోకేష్ కనకరాజు "విక్రమ్" అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. మొదటగా ఈ పాత్ర కోసం లారెన్స్ నే లోకేష్ సంప్రదించగా ఆ సమయంలో ఇతర మూవీ లతో బిజీగా ఉండడం వల్ల లారెన్స్ ఈ పాత్రను రిజెక్ట్ చేశాడు.

లా లోకేష్ దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ సినిమాలో లారెన్స్ క్యారెక్టర్ మిస్ అయ్యాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే రాఘవ లారెన్స్ , కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన జీగర్ దండ డబుల్ ఎక్స్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో ఎస్ జె సూర్య కూడా కీలకమైన పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీలో రాఘవా లారెన్స్ నటనకు గాను ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు అందాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: