విశ్వం ను నమ్ముకున్న గోపీచంద్ !

Seetha Sailaja
హీరో గోపీచంద్ కు హిట్ వచ్చి కొన్ని సంవత్సరాలు అయింది. అయినా పట్టువదలని విక్రమార్కుడులా ప్రతిసంవత్సరం ఏదోఒక సినిమాను చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఆమధ్య విడుదలైన ‘భీమ’ ఏవరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆమూవీకి బిసి సెంటర్లలో కలక్షన్స్ బాగానే రావడంతో గోపీచంద్ ను ఇష్టపడే మాస్ ప్రేక్షకులు ఇంకా చాలామంది ఉన్నారు అన్నవిషయం మరొకసారి రుజువైంది.

ఇలాంటి పరిస్థితుల మధ్య ఒకప్పుడు టాప్ దర్శకుడుగా ఒక వెలుగు వెలిగిన శ్రీను వైట్లతో జతకట్టి లేటెస్ట్ గా నటించిన ‘విశ్వం’ ట్రైలర్ ను చూసినవారికి శ్రీను వైట్ల తన పద్ధతి మార్చుకుని యాక్షన్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడా అన్నసందేహాలు కలగడం సహజం. టాప్ యంగ్ హీరోలతో సినిమాలు తీస్తూ ఒకప్పుడు క్రేజీ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన శ్రీను వైట్లకు అవకాశాలు ఎవ్వరు ఇవ్వని పరిస్థితులలో ఫ్లాప్ లతో కొనసాగుతున్న గోపీ చంద్ ఈదర్శకుడుకు ఒక అవకాశం ఇచ్చి తన అదృష్టాన్ని మరొకసారి పరీక్షించుకుంటున్నాడు.

ఒక హిల్ స్టేషన్ లో ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది. భుజాన బరువైన మెషీన్ గన్ వేసుకుని విశ్వం పాత్రలో నటిస్తున్న గోపీచంద్ అక్కడకు వచ్చి చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఆపెళ్ళిలో ఉన్న వారందరినీ ఊచ కోత కోసి రక్త పాతం సృష్టించే సీన్ ను టీజర్ గా విడుదల చేశారు. హాస్య పంచ్ డైలాగ్స్ తో సినిమాలు తీసే శ్రీను వైట్ల ఇలాంటి ఊచ కోత సినిమాలు తీయడం ఎవరికైనా షాక్ ఇచ్చే విషయం. ఇప్పటికే ఈసినిమా  ప్రొడక్షన్ అనేక చేతులు మారి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాగస్వామిగా చేరడంతో ఈమూవీ విడుదలకాబోతోంది.

కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నాడు. అనేకమంది కొత్త హీరోలు కొత్త దర్శకులు తమ సత్తాను చాటుతూ సినిమాలు తీస్తున్న ప్రస్తుత పరిస్థితులలో పరాజయాలతో సతమతమైపోతున్న శ్రీను వైట్ల గోపీచంద్ ల కాంబినేషన్ ఏమైనా సక్సస్ అయితే వీరిద్దరి దశ తిరిగినట్లే అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: