చరణ్ తో శ్రీలీల స్టెప్పులేస్తుందా..?

shami
మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో చేయబోయే సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడు. ఉప్పెన తర్వాత బుచ్చి బాబు ఎన్.టి.ఆర్ తో సినిమా చేయాలని అనుకోగా అది కాస మిస్ అయ్యింది. చరణ్ తో తన సినిమా ఫిక్స్ చేసుకున్న బుచ్చి బాబు సినిమాను భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ మూవీగా వస్తుంది. ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో బాలీవుడ్ భామ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ గా కూడా ఒకరికి అవకాశం ఉందని తెలుస్తుంది. ఆ ఛాన్స్ మొన్నటి దాకా ఉప్పెన భామ కృతి శెట్టికి ఇస్తున్నారని టాక్ వినిపించింది. ఎలాగు బుచ్చి బాబు మొదటి సినిమా ఉప్పెన సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యేలా కృతిని ఈ సినిమా లో రిపీట్ చేస్తారని అనుకున్నారు.
కానీ RC 16లో సెకండ్ హీరోయిన్ గా కృతి ని కాదని శ్రీ లీలని తీసుకుంటున్నారని తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ తో గుంటూరు కారం తర్వాత శ్రీలీల సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. అయితే ఆమె చేసే సినిమాలు లెక్క తగ్గింది. అయితే చరణ్ తో నెక్స్ట్ సినిమాలో నటిస్తుందని టాక్. సినిమాలో శ్రీలీల కూడా ఉంటే డ్యాన్స్ లో చరణ్, శ్రీ లీల పోటాపోటీగా అదరగొట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు. బుచ్చి బాబు రాం చరణ్ సినిమా గ్లోబల్ ఆడియన్స్ ను దృష్టిలో ఉంచుకుని సినిమా తెరకెక్కిస్తున్నారట. సినిమాలో జగపతి బాబు, శివరాజ్ కుమార్, సంజయ్ దత్ లాంటి బడా స్టార్స్ కూడా భాగం అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: