చిరుకు కనీస గౌరవం కూడా ఇవ్వని టాలీవుడ్ హీరోలు.. బాధలో మెగా ఫ్యాన్స్?

Suma Kallamadi

సాధారణంగా సంక్రాంతి పండుగ సందర్భంగా చాలానే టాలీవుడ్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. వీటిలో పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు అన్ని సినిమాలు ఉంటాయి. ఇది ఇప్పటి పరిస్థితి. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఎవరైనా పెద్ద హీరో సినిమా రిలీజ్‌కి రెడీ అయితే తాము సంక్రాంతి బరిలోకి దిగకూడదని మిగతా స్టార్ హీరోలు అనుకునేవారు. ఈ ఆలోచన ప్రస్తుతం ఎలా మారిపోయిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. సంక్రాంతికి పోటా పోటీగా సినిమాలు విడుదల చేయాలని స్టార్ హీరోలందరూ తెగ ఉవ్విళ్లూరుతున్నారు. వేరే హీరో సినిమా వస్తుందని, మనం మన మూవీని వాయిదా వేసుకుందాం అనే ధోరణి ఎవరిలోనూ కనిపించడం లేదు.
వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి, వశిష్ఠ కాంబోలో రూపొందుతున్న "విశ్వంభర" మూవీని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. 2025, జనవరి 10న మూవీ రిలీజ్ ఉంటుందని అఫీషియల్‌గా ప్రకటించారు. మాములుగా చిరు సినిమా వస్తుందంటే ఇండస్ట్రీలోని మిగతా హీరోలు తమ సినిమాల విడుదలలు హోల్డ్ చేసేవారు. ఈ విధంగా చిరు పట్ల గౌరవం చూపించేవారు. కానీ ఇప్పుడు సంక్రాంతి సెలవుల వేళ జరిగే మంచి బిజినెస్ ను వదులుకోవడానికి ఎవరూ సిద్ధపడటం లేదు. ఫలితంగా చిరుకు గతంలో లాగా ఇప్పుడు గౌరవం లభించట్లేదు. మెగాస్టార్ మూవీ సంక్రాంతికి వస్తుందని తెలిసినా ఏ ఇతర హీరో పట్టించుకోవడం లేదు.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న  "రాజా సాబ్" సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్‌ క్లియర్ హింట్ ఇచ్చారు. ఇక బాలకృష్ణ కూడా అప్‌కమింగ్ సినిమాతో సంక్రాంతి వేళ బరిలోకి దిగనున్నాడని టాక్. అలానే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న రవితేజ 75వ సినిమా కూడా ఈ పండక్కి రిలీజ్ చేయనున్నారు. మరోవైపు వెంకటేష్-అనీల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీని కూడా సంక్రాంతికి తీసుకొస్తామని దిల్ రాజు అనౌన్స్ చేశాడు.
చిరంజీవి సినిమాకి ఇన్ని సినిమాలు పోటీగా రావడం ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చడం లేదు. మెగాస్టార్‌కు ఎవరూ కనీస గౌరవం ఇవ్వడం లేదని వారు బాధపడిపోతున్నారు. కానీ ఇలా గౌరవం ఇస్తూ పోతుంటే వ్యాపారం దెబ్బతింటుందని ఇతర హీరోలు భావిస్తున్నారు. అందుకే తమ మూవీలు కూడా బాగా కలెక్షన్స్‌ రాబట్టగల బిగ్ ఫెస్టివల్ నాడు రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. సంక్రాంతి నాడు ఏకంగా 3 పెద్ద సినిమాలు రిలీజ్ చేసినా బాక్సాఫీస్ తట్టుకోగలదని ఇంతముందుకు కొందరు సినీ ప్రముఖులు కామెంట్స్‌ చేశారు. అంటే సినిమాలు బాగుంటే అన్నీ కూడా ఎక్కువగా కలెక్షన్స్‌ పొందడానికి అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: