"ది ఫ్యామిలీ మ్యాన్ " సీజన్ 3 వచ్చేస్తుంది.. ఈ సారి మరింత ఆసక్తికరంగా..!!

murali krishna
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో “ది ఫ్యామిలీ మ్యాన్” సిరీస్ కల్ట్ వెబ్ సిరీస్ గా మంచి పేరొందింది.అలాగే ఇండియన్ ది బెస్ట్ వెబ్ సిరీస్ లలో ఒకటిగా నిలిచింది. ఈ సిరీస్ లో మనోజ్ బాజ్‌పాయీ మరియు ప్రియమణి ప్రధాన పాత్రలలో నటించారు..ఈ సిరీస్ నుంచి ఇప్పటికే రెండు సీజన్లు రాగా.. తాజాగా మూడో సీజన్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మనోజ్ బాజ్ పాయి  ఓ గుడ్ న్యూస్ చెప్పాడు.ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 షూటింగ్ ను మరో 20 రోజుల్లో ప్రారంభించబోతున్నట్లు ఆయన వెల్లడించాడు. ఈ సిరీస్ కొత్త సీజన్ ఇంత ఆలస్యం కావడానికి గల కారణాన్ని కూడా అతడు వివరించారు.తెలుగు డైరెక్టర్లు అయిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కించారు. కొత్త సీజన్ కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఈ సందర్భంగా మనోజ్ తెలిపారు.


ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో కొత్త సీజన్ పై అంచనాలు భారీగా పెరిగాయి.దీనితో బలమైన స్క్రిప్ట్ ఉన్నప్పుడే ఈ సిరీస్ సీజన్ 3 గురించి ముందడుగు వేయాలని అనుకున్నామని ఆయన తెలిపారు.. చేసిన పనిని చేస్తున్నప్పుడు ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఆ పని మరోసారి కొత్తగా మొదలవుతుంది. అందుకే దానిని తేలిగ్గా తీసుకోవద్దు. ఆ పని కోసం కొత్త ప్రక్రియను ప్రారంభించాలి.అది ప్రిపరేషన్ లో భాగం కావాలి. నా ప్రిపరేషన్ చాలా మెరుగ్గా ఉంది. ది ఫ్యామిలీ మ్యాన్ షో నుండి అభిమానులు మరింత కోరుకుంటున్నారు. రెస్పాన్స్ బాగున్నప్పుడు ప్రేక్షకుల ఆలోచనలకు తగ్గట్టు గా వెళ్లాలి. కొత్త సీజన్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్ ఉంటే తప్ప ముందుకు వెళ్ళకూడదు..తూతూ మంత్రంగా ముగించేయకూడదు. మంచి స్క్రిప్ట్ రాసుకొని మళ్లీ మళ్లీ సరి చూసుకొని పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే ముందడుగు వేయాలి" అని మనోజ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: