విజయ్ దేవరకొండ రహస్యాన్ని బయటపెట్టిన రష్మిక !

Seetha Sailaja
విజయ్ దేవరకొండ రష్మికలు కలిసి ఇప్పటివరకు నటించిన సినిమాలు కేవలం రెండు మాత్రమే అయినప్పటికీ వీరిద్దరి సాన్నిహిత్యం పై ఏదొరకమైన వార్త లేకుండా సోషల్ మీడియాలో రోజు ఉండదు. తాము కేవలం మంచి స్నేహితులమే అని వారిద్దరు ఎన్నిసార్లు చెప్పినా అంతకుమించి ఏదో ఉంది అంటూ ఊహాగానాలు వస్తూనే ఉంటాయి.

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ నేహా ధూపియ నిర్వహించే ఒక టాక్ షోకు అతిధిగా వచ్చిన రష్మిక విజయ్ దేవరకొండకు సంబంధించిన ఒక మంచి విషయాన్ని అదేవిధంగా ఒక చెత్త విషయాన్ని బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. విజయ్ దేవరకొండ మధ్యతరగతి కుటుంబం నేపధ్యం నుండి వచ్చాడని ఇప్పుడు టాప్ హీరో స్థాయిలో ఉన్నప్పటికీ తన గతాన్ని మరిచిపోకుండా చాల సింపుల్ గా ఉంటాడు అంటూ కామెంట్స్ చేసింది.

అంతేకాదు తాను నటించే సినిమాలో చేయబోయే సీన్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఆ సీన్ లో మరింత మెరుగుగా నటించడానికి నిత్యం తపన పడుతూ ఉంటాడు అంటూ అతడి వ్యక్తిత్వం పై ప్రశంసలు కురిపించింది. అయితే షూటింగ్ గ్యాప్ లో మాత్రం ఎప్పుడు ఎవరో ఒకరితో ఫోన్ లో మాట్లాడుతూ ఏమాత్రం అలిసిపోకుండా కనిపిస్తాడని దీనితో అతడు హీరోగా కాకుండా కాల్ సెంటర్ లో ఉద్యోగిగా తనకు అనిపిస్తాడు అంటూ జోక్ చేసింది. ఇక తాను విజయ్ ని ‘విజ్జు’ అని ముద్దుగా పిలుస్తానని అంటూ తన ఫోన్ లో కూడ అతడి ఫోన్ నెంబర్ అలాగే ఫీడ్ అయిన విషయాన్ని చెపుతూ విజయ్ ముద్దు పేరును బయటపెట్టింది.

లేటెస్ట్ గా విడుదలైన ‘ఫ్యామిలీ’ స్టార్ మూవీకి మొదటిరోజు మొదటి షో నుండి ప్రపంచ వ్యాప్తంగా డివైడ్ టాక్ రావడంతో ఈమూవీ విజయ్ కలలు కంటున్న 200 కోట్ల కలలను ఎంతవరకు నెరవేరుస్తుంది అన్న విషయమై ఇండస్ట్రీలో కొందరికి సందేహాలు ఏర్పడుతున్నాయి. వరస ఫ్లాప్ లతో కొనసాగుతున్న విజయ్ కెరియర్ కు ఈమూవీ ఘన విజయం అత్యంత అవసరం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: