నాకు ఇష్టమైన హీరో అతనే... మృణాల్ ఠాగూర్..!

Pulgam Srinivas
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ కలిగిన హీరోయిన్ గా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న వారిలో మృణాల్ ఠాగూర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరో గా రూపొందిన "సీత రామం" అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకోవడం అలాగే ఇందులో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం వల్ల ఈమెకు వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.

అందులో భాగంగా పోయిన సంవత్సరం చివరలో ఈ ముద్దుగుమ్మ నటించిన హాయ్ నాన్న అనే సినిమా థియేటర్ లలో విడుదల అయ్యింది. నాని హీరో గా రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాలో కూడా ఈ బ్యూటీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమె క్రేజ్ తెలుగులో మరింత గా పెరిగింది.

ఇది ఇలా ఉంటే తాజాగా మృణాల్ "ఫ్యామిలీ స్టార్" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన ఈ సినిమాకు పరుశురామ్ దర్శకత్వం వహించగా ... దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది.

అందులో భాగంగా తనకు నచ్చిన కో స్టార్ గురించి చెప్పుకొచ్చింది. నాకు నచ్చిన కో స్టార్ దుల్కర్ సల్మాన్. ఎందుకు అంటే అతను సీత రామం సినిమా చేస్తున్న సమయంలో అడుగడుగునా నాకు ధైర్యం చెబుతూ వచ్చాడు. ఆయనే కనుక అంతలా ధైర్యం చెప్పకపోయినా ఉంటే నేను సీత రామం సినిమాలో సీత పాత్రను అంత గొప్పగా చేసే దానినే కాదు అందుకే అతను నాకు నచ్చిన కో స్టార్ అని మృణాల్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: