పృథ్విరాజ్ సుకుమారన్ నటనకు నీరాజనాలు !

Seetha Sailaja
లేటెస్ట్ గా విడుదలైన ‘ది గోట్ లైఫ్’ ‘ఆడు జీవితం’ మూవీలో నటించిన మళయాళ హీరో పృధ్వీ రాజ్ సుకుమారన్ నటనకు జాతీయస్థాయిలో విపరీతమైన ప్రశంసలు లభిస్తున్నాయి. ఈమూవీలోని అతడి నటనకు జాతీయ అవార్డు ఖాయం అనీ ఆస్కార్ అవార్డు వచ్చినా ఆశ్చర్యం లేదు  అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈమూవీ గతవారం విడుదలైనప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులు ‘టిల్లు స్క్వేర్’ ‘గాడ్జిల్లా ఎక్స్ కాంగ్’ మ్యానియాతో ఈమూవీని తెలుగు ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోలేదు.

అయితే ఈమూవీ మళయాళంలో బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడమే కాకుండా కేవలం మూడు రోజులలో అతి చిన్న రాష్ట్రమైన కేరళలో 50 కోట్లు కలెక్ట్ చేయడం షాకింగ్ న్యూస్ గా మారింది. ఈమూవీలోని నజీబ్ పాత్ర కోసం పృధ్వీ రాజ్ 31కిలోల బరువు తగ్గడమే కాకుండా ఎడారిలో షూట్ చేసిన ఒక సన్నివేశంలో రిబ్స్ కనిపించేంత సన్నగా పృథ్వీరాజ్ ట్రాన్స్‌ఫామ్ అయిన విధానం చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ఈసినిమాలో ప్రతి సీన్‌లోనూ పృధ్వీ రాజ్ తన పాత్ర కోసం పడిన వేదనా అనుభవించిన భాధ అతడి కళ్ళల్లో కనిపించడంతో ఈమూవీని చూసిన కమలహాసన్ మణిరత్నంలు పృధ్వీ రాజ్ ను ఆకాశంలోకి ఎత్తెస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆపాత్ర పడిన వేదన అనుభవించిన బాధ మొత్తాన్ని తన కళ్లల్లో చూపించారు పృథ్వీరాజ్ ఇప్పటికే ఈ సినిమాపై విశ్వనటుడు కమల్ హాసన్ డైరెక్టర్ మణిరత్నంతో సహా పలువురు సౌత్ ఇండియన్ స్టార్లు తమ ప్రశంసలు కురిపించారు. ఇంత డెడికేషన్‌ తో యాక్ట్ చేసిన పృథ్వీరాజ్‌ను మెచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా ఈసినిమాతో పృథ్వీరాజ్ నేషనల్ అవార్డ్ అందుకుంటారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇక ఈసినిమా తెలుగులో కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఆడుజీవితంగా డబ్ అయిన ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటించిన బాలీవుడ్ మూవీ ‘బడేమియా చోటేమియా’ ఏప్రిల్ 10 రంజాన్ కానుకగా రిలీజ్ కానుంది. అక్షయ్ కుమార్ టైగర్ శ్రోఫ్ హీరోలుగా రూపొందిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు. ఈ మూవీలో పృధ్వీ రాజ్ శత్రుదేశం పాకిస్థాన్ ప్రతినిథిగా నటించడం మరింత సంచలనంగా మారుతుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: