సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న ది గోట్ లైఫ్?

Purushottham Vinay
తాజాగా భారీ అంచనాలతో వరల్డ్ వైడ్ సినీ ప్రేమికుల ముందుకు వచ్చిన మూవీ ది గోట్ లైఫ్. తెలుగులో ఆడు జీవితం పేరుతో ఈ సినిమా విడుదల అయ్యింది.మలయాళ అగ్ర హీరో ప్లస్ అగ్ర దర్శకుడు అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీలో హీరోగా నటించాడు.అయితే ఈ సినిమాలో పృథ్వీ నటించాడు అనే దాని కంటే జీవించాడని చెప్పవచ్చు. ఒక సినిమా కోసం ఇంతలా కష్టపడతారా అని ప్రేక్షకులే కాకుండా సినిమా వాళ్ళు కూడా అనుకునేలా పృథ్వీ రాజ్ చేసాడు. ఆయన కష్టానికి తగ్గట్లు గానే తాజాగా గోట్ లైఫ్ కొన్ని సంచలనాలకి కేంద్ర బిందువుగా నిలుస్తుంది.సాధారణంగా ఓవర్ సీస్ లో మలయాళ చిత్రాల ప్రభావం కొంచెం తక్కువగానే ఉంటుంది. సినిమా బాగుంటే మాత్రం నెమ్మదిగా పికప్ అయ్యి ఓ మోస్తరు కలెక్షన్స్ ని సాధిస్తాయి.అలాంటిది ఇప్పుడు గోట్ లైఫ్ సినిమా రికార్డు కలెక్షన్స్ ని సృష్టిస్తుంది. పైగా అత్యంత వేగంగా మిలియన్ డాలర్ల మార్కును దాటిన ఫస్ట్ మలయాళ సినిమాగా కూడా ఈ మూవీ నిలిచింది. ఇంతకుముందు మోహన్‌లాల్ నటించిన లూసిఫర్‌ సినిమాకి ఈ రికార్డ్ ఉండేది. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే పృథ్వీ నే లూసిఫర్‌ కి దర్శకుడు కావడం గమనార్హం.


నిన్న వీకెండ్ తో కలుపుకొని వరల్డ్ వైడ్ గా మొత్తం 65 కోట్ల గ్రాస్ వసూళ్లని ఈ సినిమా రాబట్టింది. ఇవి మామూలు కలెక్షన్స్ కాదు. గోట్ లైఫ్ మూవీలో ఎక్కువ క్యారెక్టర్స్ ఉండవు. అలాగే ఎలాంటి కమర్షియల్ హంగులు ఉండవు.అలాంటిది పృథ్వీ వన్ మాన్ షో కి ప్రపంచ సినీ బాక్స్ ఆఫీస్ సెల్యూట్ కొడుతుంది. పరాయి దేశంలో చిక్కుకు పోయి నరకయాతన అనుభవించే నజీబ్ క్యారక్టర్ లో పృథ్వీ బాగా జీవించారని చెప్పవచ్చు. ఆ క్యారక్టర్ కోసం ఏకంగా 31 కిలోలు బరువు కూడా తగ్గాడు. ప్రతి సీన్‌లో కూడా నాచురల్ గా నటించి ప్రేక్షకుల చేత కన్నీళ్లు కూడా తెప్పించాడు.కమల్ హాసన్,మణిరత్నం లతో సహా చాలా మంది ఇండియన్ యాక్టర్స్ పృథ్వీ నటనని ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే నేషనల్ అవార్డ్ పక్కాగా వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది.బ్లెస్సీ దర్శకత్వంతో పాటు ఒక ముఖ్య పాత్ర కూడా పోషించాడు. 2008 లోప్రచురితమైన మలయాళ నవల ఆడుజీవితం ఆధారంగా గోట్ లైఫ్ సినిమా తెరకెక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: