విజయ్ దేవరకొండ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృనాల్ ఠాకూర్..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణల్ టాగూర్ తెలుగు ఆడియన్స్ కి ఎంత దగ్గర అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ మరాఠీ ముద్దుగుమ్మ. సీతారామం హాయ్ నాన్న వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈమె నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న

విజయ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5 నా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ సైతం శరవేగంగా జరుపుతున్నారు చిత్ర బృందం. అయితే ఈ సందర్భంగా మృణాల్ పలు చానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తుంది. ఇందులో భాగంగానే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. అలా మృనాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండ పై చేసిన పలు కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే విజయ్ దేవరకొండ రౌడీ స్టార్ ఫ్యామిలీ స్టార్ రెండు కాదని తేల్చేసింది.

విజయ్ సెట్స్ లో చాలా కామ్ గా కూల్ గా ఉంటాడు అని ఈ సందర్భంగా తెలియజేసింది. అంతేకాదు తన సన్నివేశాలను చాలా డిసిప్లిన్ గా చేస్తారు అని ఈ సందర్భంగా పేరు కొంది. విజయ్ దేవరకొండ ఎలాంటి వారో చెప్పాలంటే 'రౌడీ స్టార్, ఫ్యామిలీ స్టార్' కు మించిన వ్యక్తి అని తెలిపింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే గత ఎడాది విజయ్ దేవరకొండ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్లో వచ్చిన ఖుషీ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా బాగానే నిలిచింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: