అంచనాలను కన్ఫ్యూజ్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ !

Seetha Sailaja
ఈవారం ఏప్రియల్ 9 ఉగాది పండుగను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఫ్యామిలీ స్టార్ ఘన విజయం విజయ్ దేవరకొండ కెరియర్ కు చాల అవసరం. ‘గీత గోవిందం’ తరువాత సరైన బ్లాక్ బష్టర్ విజయ్ కి అందుబాటులోకి రాలేదు. ‘లైగర్’ ఫ్లాప్ తరువాత వచ్చిన ‘ఖుషీ’ చెప్పుకోతగ్గ స్థాయిలో విజయవంతం కాలేదు.

దీనితో విజయ్ ఆశలు అన్నీ ఈవారం విడుదల కాబోతున్న ‘ఫ్యామిలీ స్టార్’ పై ఉన్నాయి. తనకు బాగా కలిసివచ్చిన కాంబినేషన్ మూవీ కావడంతో ఈమూవీ కూడ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని విజయ్ అంచనా. ఆయితే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వస్తున్నాయి.

గతవారం విడుదలైన ‘టిల్లు స్క్వేర్’ అంచనాలకు మించి సక్సస్ అవ్వడంతో ఆమూవీ కలక్షన్స్ ‘ఉగాది’ వరకు బాగా కొనసాగే అంచనాలు వస్తున్నాయి. దీనికితోడు ప్రస్తుతం నిర్వహింపబడుతున్న ఐపిల్ క్రికెట్ టోర్నమెంట్ లైవ్ టెలికాస్ట్ ప్రోగ్రామ్ లకు యూత్ నుండి విపరీతమైన స్పందన రావడంతో ఈ టారన్మెంట్ మ్యానియాను తప్పించుకుని ఎంతవరకు యూత్ ప్రేక్షకులు ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీగా తీయబడ్డ ఫ్యామిలీ స్టార్ కు ఎంతవరకు కలక్షన్స్ కురిపిస్తారు ఆన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే సంక్రాంతి తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ఏదీ ఇప్పటివరకు రిలీజ్ అవ్వకపోవడం పిల్లలకు పరీక్షలు అయిపోవడం విజయ్ దేవరకొండ పై ఉన్న మ్యానియా ఈమూవీ కలక్షన్స్ కు సహకరిస్తాయని మరొక అంచనా. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ప్రతి సినిమా ఇప్పటివరకు తెలుగులో సూపర్ సక్సస్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ కూడ ఈసినిమాకు కలిసివస్తుంది అని అంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈమూవీలో రష్మిక అతిధి పాత్రలో నటిస్తోంది అన్న ప్రచారం ఉంది. అయితే ఈవిషయం పై సినిమా యూనిట్ నుండి ఎటువంటి స్పందనా లేకపోయినప్పటికీ వారు ఈ వార్తలను ఖండించక పోవడంతో రష్మిక ఈమూవీలో ఉండటం ఖాయం అన్న అంచనాలు ఉన్నాయి..    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: