మోక్షజ్ఞ రాకున్నా తారకరామారావు వచ్చేస్తున్నాడు !

Seetha Sailaja
స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవడు నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తే చూసి ఆనందపడాలని నందమూరి అభిమానులు కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మోక్షజ్ఞ విషయంలో బాలయ్య స్పష్టమైన క్లారిటీ ఇప్పటికీ ఇవ్వలేకపోతున్నాడు. అయితే ఎవరు ఊహించని విధంగా హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ కొడుకు తారకరామారావు హీరోగా ఎంట్రీ ఈ సంవత్సరమే ఇవ్వబోతున్నాడు అంటూ ఇండస్ట్రీలో వార్తలు గుప్పు మంటున్నాయి. న్

నందమూరి కుటుంబానికి ముఖ్యంగా హరికృష్ణ కుటుంబానికి బాగా సన్నిహితంగా ఉండే నిర్మాత దర్శకుడు వైవి చౌదరి తీయబోతున్న ఒక యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ మూవీలో హీరోగా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 10 సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణ కొడుకు జానకి రామ్ కు తన కొడుకును హీరోగా చూడాలని కలలు కంటూ ఆ కళాలుతీరాకుండానే మరణించాడు అని అంటారు. ఇప్పుడు ఆ కోరికను వైవి చౌదరి తీరుస్తున్నాడు అనుకోవాలి.  

గతంలో వైవి చౌదరి నందమూరి తారకరామారావు పేరుతో బొమ్మరిల్లు ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి హరికృష్ణ తో అనేక సినిమాలుతీయడమే కాకుండా ఒకానొక సమయంలో హరికృష్ణను మాస్ హీరోగా మార్చాడు. ఆతరువాత అతడు నాగార్జున లాంటి టాప్ హీరోలతో కూడ సినిమాలు తీశాడు. సాయి ధరమ్ తేజ్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ట్రాక్ రికార్డ్ వైవి చౌదరీకి ఉంది.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ పాపులర్ యంగ్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్న వైవి చౌదరి తిరిగి ట్రాక్ లోకి రావడమే కాకుండా ఇప్పుడు ఏకంగా నందమూరి తారకరానారావు ముని మనవడని హీరోగా పరిచయం చేయడం సంచాలనమే కాకుండా ఉత్తరాదిన రాజకపూర్ కుటుంబ వారసత్వాన్ని గుర్తుకు చేస్తోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అన్న కొడుకు కావడంతో తారక్ అభిమానులు కూడ ఇతడిని బాగా ఆదరించే ఆస్కారం ఉంది..      


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: