టిల్లు స్క్వేర్ రన్ టైం.. మరీ 2 అవర్స్ కూడా లేకుండా..!

shami
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రాం డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా టిల్లు స్క్వేర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వర హీరోయిన్ గా నటించింది. సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హాట్ షో సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడేలా చేసింది. టీజర్, ట్రైలర్ లతో టిల్లు స్క్వేర్ సూపర్ బజ్ ఏర్పరచగా మరో 3 రోజుల్లో మూవీ ఆడియన్స్ ముందుకు వస్తుంది.
అయితే ఈ సినిమా రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా సెన్సార్ టీం నుంచి సినిమా యు/ఏ సర్టిఫికెట్ అందుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా రన్ టైం కూడా చాలా తక్కువ అని తెలుసుతంది. షార్ట్ రన్ టైం తో కూడా సూప ప్లాన్ చేసినట్టుగా అర్ధమవుతుంది. డీజే టిల్లు సినిమా హిట్ టార్గెట్ ని రీచ్ అయ్యేలా టిల్లు స్క్వేర్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తుంది.
ఇప్పటికే సినిమా పై అంచనాలు తారాస్థాయిలో ఉండగా సినిమా రన్ టైం కూడా 2 గంటల లోపే అని తెలిసి సినిమా ష్యూర్ షాట్ హిట్ అనిపించేలా చేస్తున్నారు. టిల్లు స్క్వేర్ సినిమా 1 గంట 58 నిమిషాల రన్ టైం తో వస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా ఆద్యంతం అందరినీ అలరిస్తుందని. సినిమాలో అనుపమ గ్లామర్ మాత్రమే కాదు ఇంకా చాలా అంశాలు ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తాయని అంటున్నారు. టిల్లు స్క్వేర్ సినిమా తో సిద్ధు మరో బ్లాక్ బస్టర్ గురి పెట్టాడు. మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. టిల్లు స్క్వేర్ బిజినెస్ విషయంలో కూడా భారీ
డిమాండ్ ఏర్పడింది. సినిమా మీద ఉన్న బజ్ కి తగినట్టుగా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం భారీ వసూళ్లనే రాబట్టే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. డీజే టిల్లు మేనియా టిల్లు స్క్వేర్ రిపీట్ చేస్తుందా లేదా అన్నది మరో 3 రోజుల్లో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: