ఇస్మార్ట్ బ్యూటీ ఆ సినిమాతో కంబ్యాక్ అవుతుందా..?

shami
రామ్
 నటించిన ఇస్మార్ట్ శంకర్ లో నటించి ఇస్మార్ట్ బ్యూటీగా క్రేజ్ తెచ్చుకుంది నభా నటేష్.   అందంతో పాటు అభినయం కూడా ఉన్నా సరే అమ్మడికి మాత్రం అందుకు తగిన ఛాన్సులు రావట్లేదని చెప్పొచ్చు. నితిన్ తో కలిసి నటించిన మాస్ట్రో సినిమా తర్వాత అవకాశాలు లేని నభా నటేష్ ఈమధ్య సినిమాల కన్నా తన ఫోకస్ మొత్తం ఫోటో షూట్స్ మీదకు మార్చుకుంది. ఒక మంచి ఆఫర్ కోసం కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న నభా నటేష్ కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవెల్ లో అదరగొట్టిన నిఖిల్ నెక్స్ట్ సినిమాలో నభాకు ఛాన్స్ వచ్చింది.
కార్తికేయ 2 తర్వాత నిఖిల్ ఓ పక్క స్వయంభు మరోపక్క ంది ఇండియ హౌస్ సినిమా చేస్తున్నాడు. భరత్ కృష్ణమాచార్య డైరెక్షన్ లో చేస్తున్న స్వయంభు సినిమాలో ఆల్రెడె సం యుక్త మీనన్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేయగా మరో మరో హీరోయిన్ గా నభా నటేష్ ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాను భువన్ సాగర్ అనే నిర్మాత నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో సం యుక్త తో పాటుగా నభా నటేష్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. తప్పకుండా అమ్మడికి ఈ సినిమా బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేస్తుందని అంటున్నారు. ఇస్మార్ట్ బ్యూటీగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నభా నటేష్ స్వయంభుతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది. మరి అమ్మడికి ఈ సినిమా ఏ రేంజ్ క్రేజ్ తెస్తుందో చూడాలి. నిఖిల్ పాన్ ఇండియా ప్లానింగ్ లో భాగంగా వస్తున్న ఈ సినిమాల మీద అంచనాలైతే భారీగానే ఉన్నాయి. మరి ఈ సినిమా తో నభాకు ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి. ఇదే కాదు టాలీవుడ్ లో ఇంకా మరిన్ని ఛాన్సులు కోసం ఎదురుచూస్తున్న నభా నటేష్ ఫ్రీ టైం లో తన ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: