గోపీచంద్‌తో సినిమా చేయబోతున్న 'రాధేశ్యామ్ దర్శకుడు...??
శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ కూడా స్పీడ్ గా జరుగుతూ ఉండడం తో గోపీ చంద్ తన తదుపరి మూవీ పై కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రాధాకృష్ణ దర్శకత్వంలో గోపీ చంద్ తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. భీమా మాతో సక్సెస్ ట్రాక్ అందుకున్నారు హీరో గోపిచంద్. మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా హర్ష దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే తన తర్వాతి సినిమాల విషయంలో సాహసం చేస్తున్నారు గోపిచంద్. రాధేశ్యామ్ వంటి భారీ డిజాస్టర్ సినిమాను ఇచ్చిన రాధాకృష్ణతో సినిమాకు ఓకే చెప్పేశారు. గతంలో గోపిచంద్‌తో జిల్ సినిమా చేశారు గోపిచంద్. 2015లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే తర్వాత తెరకెక్కిన రాధేశ్యామ్ భారీ డిజాస్టర్‌గా మిగిలింది.ఇప్పటికే ఈ మూవీ స్టోరీ లైన్‌ను గోపీచంద్‌కు వినిపించగా ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉండగా ఈ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది.