హాట్ టాపిక్ గా మారిన జాన్వి కపూర్ భక్తి !

Seetha Sailaja
శ్రీదేవి వారసురాలుగా ఫిలిమ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి వచ్చి ఆరు సంవత్సరాలు దాటిపోయినప్పటికీ బాలీవుడ్ లో ఇప్పటికీ ఆమె పూర్తిగా సెటిల్ కాలేకపోతోంది. మంచి నటిగా పేరు ఉన్నప్పటికీ బాలీవుడ్ టాప్ యంగ్ హీరోల సినిమాలలో ఆమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఇప్పుడు ఆమె తన రూట్ మార్చి దక్షిణాది వైపు వస్తూనే టాప్ యంగ్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది.

ఆమె పట్ల తెలుగు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో తెలియకపోయినా లేటెస్ట్ గా రామ్ చరణ్ పక్కన నటించే సినిమాలో ఆమెకు 5 కోట్ల పారితోషికం ఇస్తున్నారు అని వస్తున్న వార్తలను బట్టి ప్రస్తుతం ఆమె మ్యానియా టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. జాన్వీ తల్లి శ్రీదేవి వాస్తవానికి తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ ఆమెను తెలుగు ప్రేక్షకులు ఆరాధ్య దేవతగా ఆరాధించారు.

శ్రీదేవి గ్లామర్ కు చిరునామ అయిన ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఆమెకు భక్తి ఎక్కువ. ఆ భక్తితోనే ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని ఆమె జీవించి ఉన్నంత కాలం సంవత్సరానికి రెండు సార్లు వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉండేది. జాన్వీ కూడ తన చిన్నతనం నుండి తన తల్లితో తిరుపతి రావడం అలవాటుగా మార్చుకుంది. భక్తి విషయంలో శ్రీదేవి కంటే జాన్వీ ఒక మెట్టు పైనే ఉంది.

తాను హీరోయిన్ అయిన దగ్గర నుండి ఏడు కొండలు మెట్లు నడక మార్గంలో ఎక్కడమే కాకుండా మోకాలితో ఆ ఏడు కొండల మెట్లు ఎక్కుతూ మెట్టుమెట్టుకు కొబ్బరికాయలు కొట్టడం ఆమె అలవాటు. లేటస్ట్ గా రామ్ చరణ్ బుచ్చి బాబుల కాంబినేషన్ లో ప్రారంభయం అయిన మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన జాన్వీ ఆమరునాడు తన అలవాటు ప్రకారం తిరుపతి వెళ్ళి ఏడు కొండల మెట్లు మోకాలితో సాధారణ వ్యక్తిగా ఎక్కుతున్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: