రెండో పెళ్లిపై.. తన కొడుకు అలా అడిగాడంటున్న రేణు దేశాయ్..!!

Divya
మొదట కాస్ట్యూమ్ డిజైనర్ గా మోడల్ గా రాణించి ఆ తర్వాత హీరోయిన్గా తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్.. అలా రేణు దేశాయ్ మొదట బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ను ప్రేమించి మరి పెళ్లి కాకముందే ఒక బిడ్డకు తల్లి అయ్యి.. ఆ తర్వాత వివాహం చేసుకొని మరొక బిడ్డకు జన్మనిచ్చింది రేణు దేశాయ్.. ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఇద్దరు విడిపోవడం జరిగింది. అయితే పిల్లల బాగోగులను మాత్రం రేణు దేశాయ్ చూసుకుంటోంది.


ఇటీవలే రవితేజ తెరకెక్కించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో హేమలత లవణం అనే పాత్రలో నటించింది.. ఇకపోతే గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో షోలో రేణు దేశాయ్ పాల్గొనింది. ముఖ్యంగా రెండో పెళ్లి విషయం పైన పలు రకాల ప్రశ్నలు ఎదురవ్వగా  వాటికి సమాధానంగా తెలియజేసింది.."నా రెండో పెళ్లి చేయాలని తన పేరెంట్స్ చాలా సంబంధాలు చూశారని.. తాను కూడా ఇలాంటి వాడు వస్తాడు అంటూ చాలా కలలు కన్నాను.. ఒకరితో మాట్లాడినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదని.. కానీ తాను రెండో పెళ్లి చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనని చంపేస్తామంటూ బెదిరిస్తూ పోస్టులు పెట్టారని.. పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకో పెళ్లి చేసుకుంటే ఎవరు మాట్లాడలేదు నా విషయంలోనే ఎందుకు అంటూ క్వశ్చన్ మార్క్ వేసింది రేణు దేశాయ్".



అయితే ఇప్పుడు అలాంటివేవీ పట్టించుకోను నా పిల్లలు కూడా తనని అడిగారు.. నాన్న మరో వివాహం చేసుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఒంటరిగా ఉంటున్నావ్ అమ్మ పెళ్లి చేసుకోమని అకిరా కూడా అడిగారని తెలిపింది.. అందుకు చేసుకుంటానని మనకు కరెక్ట్ పర్సన్ దొరకాలి కదా అని చెప్పానని..కానీ పిల్లలు వాళ్ళ నాన్నతో ఎందుకు విడిపోయారని ఎప్పుడు కూడా అడగలేదు.. ఒకవేళ వివాహం చేసుకుంటే తాను అందరికీ గర్వంగానే చెబుతానంటూ రేణు దేశ వెల్లడించింది. గతంలో చేసినటువంటి ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: