RGV ఊరికే ఉండడుగా.. ఆ హీరో బయోపిక్ తీయబోతున్నాడట?

praveen
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.  ఒకప్పుడు తన సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన వర్మ ఇక ఇప్పుడు వివాదాలతో సెన్సేషన్ గా మారిపోతున్నాడు అని చెప్పాలి. ఏకంగా వివాదాస్పదమైన సినిమాలు తీస్తూ ఎప్పుడు వార్తలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాడు. ఇక మరోవైపు వర్మ ఇంటర్వ్యూలలో చేసే కామెంట్స్ కూడా సంచలనంగా మారిపోతున్నాయి అని చెప్పాలి.

 నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదు రోయ్.. అన్న విధంగా నా రూటే సపరేటు అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటాడు. అయితే వివాదం అనే పదం వినిపించింది అంటే చాలు అక్కడ మొదటగా కనిపించేది రాంగోపాల్ వర్మ మాత్రమే. వివాదాలు ఆయన చుట్టూ తిరుగుతాయో లేకపోతే వివాదాల చుట్టూ ఆయన తిరుగుతాడో కూడా కొన్ని కొన్ని సార్లు అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికే ఏపీ రాజకీయాలపై వరుసగా సినిమాలు చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తున్న వర్మ మరో వివాదాస్పదమైన విషయాన్ని టచ్ చేయబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఏకంగా దివంగత హీరో ఉదయ్ కిరణ్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీయబోతున్నాడట.

 ఉదయ్ కిరణ్ బయోపిక్ ఇప్పటికి ఇండస్ట్రీలో సెన్సేషన్. కొంతమంది ఇండస్ట్రీ పెద్దల కారణంగానే ఉదయ్ కిరణ్ కెరియర్ నాశనం అయిందని అందుకే సూసైడ్ చేసుకున్నాడు అంటూ ఇప్పటికీ వార్తలు వస్తూనే ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి వివాదాస్పదమైన వ్యవహారాన్ని.. ఆర్జీవి డీల్ చేస్తున్నాడు అని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక ఈ బయోపిక్ తీసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడట. దీనిపై ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారట రాంగోపాల్ వర్మ. కాగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగిన ఉదయ్ కిరణ్ తర్వాత కాలంలో మాత్రం ఆర్థిక సమస్యల కారణంగా సూసైడ్ చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: