బుచ్చిబాబు షాక్ లతో సుకుమార్ మైండ్ బ్లాంక్ !

Seetha Sailaja
గతంలో దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యులు ఎంతోమంది టాప్ దర్శకులుగా తమ హవా కొనసాగించారు. ఆతరువాత ఆసాంప్రదాయాన్ని రామ్ గోపాల్ వర్మ కూడ కొనసాగించాడు. అయితే వర్మ శిష్యులలో ఒక్క పూరీ జగన్నాథ్ మినహా మిగతవారు పెద్దగా రాణించలేదు. విలక్షణ దర్శకుడుగా పేరు గాంచిన సుకుమార్ శిష్యుల హవా ఇప్పుడు కొనసాగుతోంది.

తన మొట్టమొదటి సినిమా ‘ఉప్పెన’ తో తన స్పెషాలిటీని చూపెట్టుకున్న ‘బుచ్చిబాబు’ లేటెస్ట్ గా రామ్ చరణ్ తో మొదలుపెట్టిన ‘పెద్ది’ మూవీ ప్రారంభోత్సవ హడావిడి చూసిన వారు బుచ్చిబాబు తన సినిమాకు ఇంత భారీ క్యాస్టింగ్ ఎలా ఒప్పించగలిగాడు అంటూ ఆశ్చర్యపోతున్నాడు. రామ్ చరణ్ జాహ్నవీ రెహమాన్ లాంటి దిగ్గజాలను ఒక్కచోట తీసుకువచ్చిన బుచ్చిబాబు సమర్థత చూసి తాను కూడ షాక్ అయ్యాను అంటూ ఓపెన్ గా సుకుమార్ చెప్పాడు అంటే అతడి రేంజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది.

ఈసినిమాలో ఒక కీలకపాత్ర కోసం కన్నడ టాప్ హీరో శివరాజ్ కుమార్ దగ్గరకు బుచ్చిబాబు వెళ్ళినప్పుడు అతడు అరగంట సమయం ఇస్తానని ఆ అరగంటలో తన పాత్ర ఏమిటో చెప్పమని అడిగితే ఏకంగా గంటన్నర ఏకధాటిగా బుచ్చిబాబు ఈమూవీ కథ అతడికి చెపుతున్నప్పుడు అతడికి టైమ్ తెలియలేదు అంటే చాల సింపుల్ గా కనిపించే బుచ్చిబాబులో ఎంతలోతు ఉందో అర్థం అవుతుంది. ఈమధ్యనే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈమూవీ కథ ఉత్తరాంధ్ర నేపధ్యంలో ఉంటుందని తెలుస్తుంది.

ఉత్తరాంధ్ర ప్రజల భాషలో ఉండే ఒక ప్రత్యేకతను స్పష్టంగా తెలియచెప్పే విధంగా ఈమూవీలోని డైలాగ్స్ ఉంటాయి అంటున్నారు. ఈ ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీని చరణ్ జాన్వీ లకు నేర్పించడానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక లెక్చరర్ ను చరణ్ కు జాహ్నవీ కి ట్యూటర్ గా పెట్టి ఆ పదాలను ఎలా పలకాలో బుచ్చిబాబు వీరిద్ధరికీ ట్రైనింగ్ కూడ ఇప్పిస్తున్నాడట. ‘రంగస్థలం’ మూవీ తరువాత చరణ్ చాల సహజంగా నటించే సినిమాగా ఇది మారబోతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: