బోల్డ్‌ క్యారెక్టర్ చేయడానికి కారణం అదే అంటున్న అనుపమ...!!!

murali krishna
మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మల్లో అనుపమ పరమేశ్వరన్ క్రేజే వేరు. ఈ చిన్నది తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ లో నటించింది. ఈ లో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది అనుపమ. ఆతర్వాత ఈ బ్యూటీ క్రేజ్ పెరిగిపోయింది. సోలో హీరోయిన్ గా నటించిన లన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. యంగ్ హీరోలందరి సరసన నటించిన ఈ వయ్యారి తెలుగులో స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. అయితే అనుపమ పరమేశ్వరన్ ఇప్పటివరకు రొమాంటిక్ సీస్స్ లో నటించలేదు. అలాగే బోల్డ్ గానూ కనిపించలేదు. మొన్నామధ్య మాత్రం రౌడీ బాయ్స్ లో లిప్ లాక్ తో షాక్ ఇచ్చింది. దాంతో అభిమానులంతా అవాక్ అయ్యారు. అనుపమ ఇలా లిప్ లాక్ తో రెచ్చిపోయిందేంటి అంటూ ఆశ్చర్యపోయారు.ఇక ఇప్పుడు సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ లో నటిస్తుంది అనుపమ. అయితే ఈ లో అనుపమ మునుపెన్నడూ లేని విధంగా బోల్డ్ గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ లో అనుపమ లుక్ కిల్లింగ్ అనే చెప్పాలి. అలాగే మొన్నామధ్య విడుదలైన ఈ టీజర్‌లో మరింత రెచ్చిపోయింది అనుపమ.
లిప్ లాక్ తో పాటు స్కిన్ షోతో హాల్ చల్ చేసింది. తాజాగా ఈ నుంచి మరో న్యూ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అనుపమకు బోల్డ్ గా నటించడం పై ప్రశ్న ఎదురైంది. దీని పై అనుపమ స్పందిస్తూ.. మీకు బిర్యానీ అంటే ఇష్టమా..? కానీ ప్రతి రోజు బిర్యానీ తినలేము కదా..? బోర్ వచ్చేస్తుంది. అలాగే నాకు కూడా రొటీన్ పాత్రలు చేసి బోర్ వచ్చింది. అందుకే ఇలా ట్రై చేశా.. అని తెలిపింది అనుపమ. అఆ చేసినప్పుడు నా వయసు 19 ఏళ్లు ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 9 ఏళ్లు అవుతుంది. ఈ తొమ్మిది ఏళ్లు చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేయాలని అనుకోవడం తప్పు కదండీ.. నేను కూడా మనిషినే కదండీ.. నేను నటిగా నాకు కంఫర్ట్ బుల్ గా ఉండే పాత్రలే చేస్తున్నాను. అలాగే ఈ లో నాకు వచ్చిన పాత్రను వదులుకోవడం ఇష్టం లేదు. ఒక కమర్షియల్ లో ఇంత మంచి పాత్ర దొరకదు.. కావాలంటే నేను రాసిస్తా.. అలాంటి పాత్రను నేను వదులుకోవాలనుకోవడం లేదు. అదేవిధంగా యాక్టర్ గా నా లిమిటేషన్స్ నాకు ఉన్నాయి. నా బాధ్యత ప్రకారం నేను నటించాను అని క్యూట్ గా చెప్పుకొచ్చింది అనుపమ.అందంగా కనిపించడం మంచిదే కదా (నవ్వుతూ). నా కెరీర్‌లో నేను పోషించిన పాత్రల్లో లిల్లీ (ఈ సినిమాలోని క్యారెక్టర్‌) ప్రత్యేకం. మూడేళ్ల క్రితం ప్రయోగాత్మక పాత్రల్లో నటించడం ప్రారంభించా. అంతకుముందు నాకున్న పరిధుల దృష్ట్యా కొన్ని క్యారెక్టర్లు ప్లే చేయలేకపోయా. అన్ని చిత్రాల్లో ఒకేలాంటి పాత్రల్లో నటించడంతో బోర్‌ ఫీలయ్యా. ఏదైనా పెర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉంటేనే చేస్తా తప్ప హీరోయిన్‌ ఇమేజ్‌ కోసం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: