ఆ ఒక్క సినిమాలో తప్ప.. అన్ని సినిమాల్లో శ్రీలీల ఆ పని చేసింది గమనించారా?

praveen
శ్రీ లీల.. పేరుకి కన్నడ బ్యూటీ. కానీ ప్రస్తుతం తెలుగింటి అమ్మాయిగా సినీ ప్రేక్షకులందరికీ కూడా దగ్గర అయింది అని చెప్పాలి. రాఘవేంద్ర పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాలోనే తన టాలెంట్ తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది . ఇక ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ ఇక తక్కువ ఏజ్ లోనే టాప్ హీరోయిన్గా హవా నడిపిస్తూ వస్తుంది శ్రీ లీల.

 అయితే ఇప్పుడు వరకు తన కంటే డబుల్, త్రిబుల్ ఏజ్ ఉన్న హీరోలతో కూడా కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ. ఇక అందరితో రొమాన్స్ చేసి ఔరా అనిపించింది ఈ సొగసరీ. అయితే ఇప్పుడు వరకు అందరు హీరోల సినిమాల్లో డాన్సులతో ఇరగ తీయడమే కాదు హీరోలతో డీప్ రొమాన్స్ లో మునిగితేలిన శ్రీ లీల ఒక్క సినిమాలో మాత్రం ఇలా రొమాన్స్ జోలికి వెళ్లలేదు. అదే బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి ఈ మూవీలో బాలకృష్ణ చెల్లెలి పాత్రలో నటించింది శ్రీ లీల. ఇక మొదటిసారి ఈ మూవీలో ఎలాంటి రొమాంటిక్ టచ్ లేకుండా ఎంతో పద్ధతిగా నటించింది అని చెప్పాలి. మిగతా సినిమాలలో కొన్నింటిలో తక్కువ రొమాన్స్ ఉంటే మరికొన్నింటిలో మాత్రం హద్దులు మీరీ పోయింది.

 కానీ భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీలను ఎలాంటి పాత్రలో అయితే అభిమానులు చూడాలి అనుకున్నారో.. అలాంటి పాత్రలోనే నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక ఈ విషయాన్ని ఈ హీరోయిన్ అభిమానులు కూడా కనిపెట్టేశారు. దీంతో ప్రస్తుతం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న శ్రీ లీల గత కొంతకాలం నుంచి మాత్రం ఏ సినిమాకి కమిట్ అవడం లేదు. దీనికి కారణం ఇటీవల కాలంలో శ్రీలీలా చేస్తున్న సినిమాలు ఇండస్ట్రీలో పెద్దగా హిట్ కాకపోవడమే అన్నది తెలుస్తోంది. అయితే ఇక సినిమా కథల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని ఈ అమ్మడు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే తొందరపడి ఏ సినిమాకు ఇప్పుడే కమిట్ కాకూడదని అనుకుంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: