RC 16 కి ఇదేం టైటిల్ బుచ్చిబాబు?

Purushottham Vinay
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన 16వ సినిమాను ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో వెయిటింగ్ లిస్టులో ఉన్న ఈ సినిమా మొత్తానికి సెట్స్ పైకి రాబోతోంది.అసలు గత ఏడాదిలోనే ఈ సినిమా  మొదలు కావాల్సింది. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా బాగా ఆలస్యం కావడంతో బుచ్చిబాబు కూడా రామ్ చరణ్ కోసం చాలా రోజులపాటు ఎదురు చూడాల్సి వచ్చింది.ఇక మొత్తానికి సరైన ప్లాన్ సెట్ కావడంతో ఈ సినిమాని మార్చి 20వ తేదీన మొదలుపెట్టబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వరకు పూర్తి చేసుకున్న దర్శకుడు ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి రెండు కీలకమైన ఎపిసోడ్స్ ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ఒక సీరియస్ డ్రామా సీన్ తోనే షూటింగ్ మొదలు కాబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు టైటిల్ కూడా ఇప్పటికే ఫిక్స్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది.అయితే రామ్ చరణ్ మాత్రం ఇంకా ఆ టైటిల్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.



దర్శకుడు బుచ్చిబాబు కథకు తగ్గట్టుగా 'పెద్ది' అనే టైటిల్ అనుకున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే ఇదే టైటిల్ తో గతంలో ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా రాబోతుంది అని చాలా రకాల గాసిప్స్  వచ్చాయి. అది కూడా బుచ్చిబాబు డైరెక్ట్ చేసే అవకాశం ఉందని కూడా ఇండస్ట్రీలో టాక్  వినిపించింది. నిజానికి బుచ్చిబాబు మొదట ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతోనే ఆ కథ రామ్ చరణ్ వద్దకు వెళ్ళిందని కొన్ని మార్పులతో దర్శకుడు సరికొత్తగా సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా  టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ఇది ఎంతవరకు నిజమో తెలీదు కానీ మొత్తానికి ఈ టైటిల్ విషయంలో రామ్ చరణ్ ఫాన్స్ నుంచి అంతగా పాజిటివ్ రియాక్షన్స్  రావడం లేదు.ఈ పెద్ది అనే టైటిల్ చాలా ఓల్డ్ గా ఉంది అని ఈ టైటిల్ అంతగా కిక్ ఇవ్వడం లేదనే విధంగా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలం అయింది. గేమ్ ఛేంజర్ కు సంబంధించిన సరైన బజ్ కూడా క్రియేట్  కాలేదు. ఇక ఇప్పుడు పెద్ది అనే టైటిల్ పెట్టి మరోసారి రామ్ చరణ్ ఫాన్స్ ను నిరుత్సాహపరచకండని కామెంట్స్ కూడా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: