ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ చేతులో ఎన్ని మూవీలు ఉన్నాయో తెలిస్తే షాక్ కావాల్సిందే..!

Pulgam Srinivas
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి దేవి శ్రీ ప్రసాద్ చేతిలో ప్రస్తుతం అనేక సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈయన ఏ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు అనే విషయాలను తెలుసుకుందాం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మొదటి భాగం కి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించడంతో ఈ మూవీ రెండవ భాగం ఆల్బమ్ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా శ్రీ లీల హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. నాగ చైతన్య హీరో గా సాయి పల్లవి హీరోయిన్ గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తంల్ మూవీ కి కూడా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.


ధనుష్ , నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర మూవీ కి కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. విశాల్ హీరో గా ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా హరి దర్శకత్వంలో రూపొందుతున్న రత్నం అనే తమిళ సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే అజిత్ కుమార్ హీరో గా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న "గుడ్ బ్యాడ్ అగ్లీ" అనే తమిళ సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇలా ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ చేతిలో ఈ ఏడు క్రేజీ సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ ఏడు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

dsp

సంబంధిత వార్తలు: