మెగా హీరోలకు చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ కాదు బరువు.. నాని కామెంట్స్ వైరల్?

praveen
సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో గుర్తింపును సంపాదించుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఇక ఏదైనా బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే ఇక ఈ మాయా లోకంలో నిలబడగలం. అలాంటిది ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఏకంగా తెలుగు ప్రేక్షకుల మెగాస్టార్ గా మారిపోయారు చిరంజీవి. ఏకంగా ఇప్పటివరకు 150 కి పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం ఆరుపదుల వయస్సు దాటిపోతున్న ఇంకా యంగ్ హీరోలకు సైతం పోటీ ఇచ్చే విధంగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

 అయితే కేవలం మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కావడమే కాదు ఇక మెగా అనే ఫ్యామిలీ నుంచి దాదాపు అరడజనుకు పైగా హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అందరూ ఎవరికివారు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో అటు రామ్ చరణ్, అల్లు అర్జున్, తేజ్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పాలి. ఇక మెగా అనే బ్యాగ్రౌండ్ తోనే ఈ హీరోలు ఇండస్ట్రీకి పరిచయమై ఇక ఇప్పుడు స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇలా మెగా బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి పరిచయమైన హీరోల గురించి న్యాచురల్ స్టార్ నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 ఇండస్ట్రీలో అందరూ అనుకుంటూ ఉంటారు చరణ్, అల్లు అర్జున్ తేజ్ వరుణ్ కు చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ అని. కానీ మీరు వారికి బ్యాగ్రౌండ్ కాదు సార్ ఒక బరువు, బాధ్యత. మాలాంటి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ప్రతి వాడికి చిరంజీవి గారు ఒక బ్యాగ్రౌండ్. ఒకప్పుడు గంటల గంటలు ఆయన కోసం సత్యం థియేటర్లో లైన్లో నిలబడ్డాను. పోలీసుల చేతిలో తన్నులు కూడా తిన్నాను. కానీ మిమ్మల్ని చూసి ఎంతగానో మురిసిపోయాను. అయితే ఓషోలో చిరు గారు నానీలా కష్టపడి పైకి వచ్చిన వాళ్లకు నేను దాసోహం అన్నారు. అలాగే నాని లో కూడా నన్ను నేను చూసుకుంటున్నా అంటూ చిరంజీవి ప్రశంసించారు. మెగాస్టార్ అలాంటి మాట అనడంతో నేను ఆనందంలో తేలిపోయాను అంటూ నాని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: