నిహారికకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!!

Divya
మెగా డాక్టర్ గా ఇండస్ట్రీలో పేరుపొందిన నిహారిక గురించి చెప్పాల్సిన పనిలేదు.. నిత్యం ఈమె గురించి ఏదో విధంగా సోషల్ మీడియాలో పేరు వినిపిస్తూనే ఉంటుంది.. మొదట యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి అనంతరం హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించింది.. ఇక పోతే నిహారిక ప్రస్తుతం తన భర్త నుంచి విడాకులు తీసుకుని నిర్మాతగా నటిగా మళ్లీ ఇండస్ట్రీలో కొనసాగాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కావడం చేత అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇటీవల కాలంలో మెగా కుటుంబ సభ్యులు ఏ ఇంటర్వ్యూలో మాట్లాడిన కూడా రాజకీయాలకు సంబంధించిన విషయాల పైన కూడా మాట్లాడుతున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలో ఉన్నారు. అంతేకాకుండా ఈయన వెంట నాగబాబు కూడా రాజకీయాలలో పాల్గొనడంతో మెగా హీరోలకు తప్పనిసరిగా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే నిహారిక బాబాయ్ పొలిటికల్ గురించి పలు రకాల ప్రశ్నలు ఎదురవగా తన బాబాయ్ పొలిటికల్ గురించి మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ అడగగా.. ఈసారి కచ్చితంగా జనసేన పార్టీ గెలవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అంటూ వెల్లడించింది.

తన ఓటు కూడా ఆంధ్రాలోనే ఉండేది.. కానీ ఇప్పుడు రద్దయిందని కారణాలు ఏంటో మాత్రం తెలియలేదని వెల్లడించింది..ఆంధ్రాలో మేము ఒక ఇంటిని కూడా కొనుక్కోవాలని ప్రయత్నాలు చేస్తున్నాము.. తన తండ్రి రాజకీయాలలో బిజీగా ఉండడం చేత ఇంటికి రావడమే మానేశారని.. అలా వచ్చి ఇలా వెళుతున్నారని అందుకే ఇక్కడే ఇల్లు కొనుక్కోవాలని భావిస్తున్నట్లుగా వెల్లడించింది.. తన బాబాయ్ కూడా రాజకీయాలలోకి వెళ్లి చాలా కష్టపడుతున్నారని పొలిటికల్ లోకి తాను వెళ్లకపోయినా తన చుట్టూ ఉండే వాళ్ళ క్షేమం కోరుకుంటానంటూ తెలిపింది నిహారిక. ప్రస్తుతం నిహారిక చేసినటువంటి ఈ కామెంట్స్ సైతం వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: