తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా 2023లో విడుదల అయ్యి సంచలన విజయం సాధించింది. ఇటీవల లాల్ సలాం సినిమాతో వచ్చి దారుణమైన ప్లాప్ ని ఎదురుకున్నాడు రజినీకాంత్. ఇప్పుడు రజినీకాంత్ లోకేష్ కనగరాజ్, జైభీమ్ దర్శకుడి TJ జ్ఞానవేల్ తోను పని చేస్తున్నాడు. ఇంతలోనే జైలర్ సినిమా సీక్వెల్ కోసం నెల్సన్ తో కలిసి పని చేస్తారని కథనాలొచ్చాయి.జైలర్ సినిమా సీక్వెల్‌పై దర్శకుడు నెల్సన్ ని ప్రశ్నించగా, అతడు దీనిపై క్లారిటీనిచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్ - నెల్సన్ దిలీప్ కాంబినేషన్ లో జైలర్ బాక్సాఫీస్ రికార్డుల పరంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అభిమానులు రజనీకాంత్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా అలా చూపించడంలో నెల్సన్ సక్సెసయ్యాడు. జైలర్ సినిమా ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన తమిళ సినిమాలలో ఒకటిగా నిలిచింది.చాలా కాలం క్రితం జైలర్ 2 సినిమా కోసం నెల్సన్-రజనీ కలుస్తున్నారని పుకార్లు వచ్చాయి.
అయితే ఇటీవలి మీడియా ఈవెంట్లో డైరెక్టర్ నెల్సన్ తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు.భవిష్యత్తులో జైలర్ 2ని ఆశించవచ్చా? అని అడిగినప్పుడు నెల్సన్ దానికి బదులిస్తూ.. ప్రస్తుతం ఇది తరువాత ప్రాజెక్ట్ అవుతుందా లేదా అనేది ఇంకా నాకు తెలియదు... ప్రకటన కోసం వేచి ఉండండి.. అని అన్నారు. తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి హోస్ట్ ప్రశ్నించగా.. నెల్సన్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, రెండు నెలల్లో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని బదులిచ్చారు.ఈ ఏడాది రజనీ వరుస సినిమాలతో బిజీ కానున్నారు. ప్రస్తుతం జై భీమ్ దర్శకుడు T.J జ్ఞానవేల్‌తో తన తదుపరి చిత్రం వేట్టైయన్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.ఈ మూవీని 2024లో విడుదల చేయాలని భావిస్తున్నారు. వేట్టైయన్‌లో ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి ఇంకా అమితాబ్ బచ్చన్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో తలైవర్ 171 అనే చిత్రానికి సంతకం చేశారు. దీని షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఊహాగానాలు నిజమైతే 'జైలర్ 2' చేయడానికి ఆస్కారం కూడా ఉంది. జ్ఞానవేల్ టిజే, లోకేష్ కనగరాజ్ చిత్రాల తర్వాత నెల్సన్ కి ఛాన్సుంటుందని సమాచారం తెలుస్తుంది.