ప్రేమించిన హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో హిట్స్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు.. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో బడ బ్యానర్ల పైన సినిమాలలో నటించే అవకాశాలను అందుకున్నారు.. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండానే వరుసగా అవకాశాలు అందుకుంటున్న కిరణ్ అబ్బవరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా తన నటించిన హీరోయిన్ ని వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.. అందుకు సంబంధించి ఇప్పటికే పెద్దలతో కూడా మాట్లాడాలని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఆ తర్వాత మళ్లీ కొద్ది రోజులు సైలెంట్ గా మారిన ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.నిజంగానే ఈ యువ హీరో తను ప్రేమించిన హీరోయిన్ వివాహం చేసుకోబోతున్నారని ఆమె ఎవరో కాదు కిరణ్ అబ్బవరం నటించిన మొట్టమొదటి సినిమా హీరోయిన్ అన్నట్టుగా తెలుస్తోంది.. రాజా వారు రాణి గారు సినిమా 2019 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇందులో హీరోయిన్గా నటించిన రహస్య ఘోరక్ తో కిరణ్ అబ్బవరనికి  మంచి స్నేహబంధం ఏర్పడింది.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారినట్టు సమాచారం.

ఇప్పుడు నిజజీవితంలో కూడా వీరిద్దరూ జంటగా కనిపించబోతూ ఉండడం గమనార్హం. కిరణ్ హీరోయిన్ రహస్య ఎంగేజ్మెంట్ ఈనెల 13వ తేదీన జరగబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక ఇండస్ట్రీలోని కొంతమంది అతిధుల సమక్షంలో జరగబోతున్నట్లు సమాచారం. వెడ్డింగ్ డెస్టినేషన్ కోసం విదేశాలకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. మరి ఈ విషయం పైన అటు హీరోయిన్ కానీ కిరణ్ అబ్బవరం కానీ స్పందిస్తారేమో చూడాలి.. కిరణ్ అబ్బవరం సినీ కెరియర్ విషయానికి వస్తే మొదట తాజా వారు రాణి గారు సినిమా సక్సెస్ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపంతో మంచి విజయాన్ని అందుకున్నారు.. ఆ తర్వాత సెబాస్టియన్ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న ఆ వెంటనే సమ్మతమే అనే సినిమాలో డీసెంట్గా సక్సెస్ అందుకున్నారు.. ఆ తర్వాత నేను మీకు బాగా కావాల్సిన వాడిని ,వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకులను బాగానే అలరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: