బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే.. ఏకంగా ఆ స్టార్ హీరోతో కలిసి..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ముద్దుగుమ్మ బుట్ట బొమ్మగా పేరు తెచ్చుకున్న పూజ హెగ్డే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక వైపు సినిమాలో వెంటాడుతున్నప్పటికీ సినీ ఇండస్ట్రీలో తనకున్న క్రెజ్ మాత్రం కొద్దిగా కూడా తగ్గలేదు. తను చేస్తున్న సినిమాలు ఒక్కొక్కటిగా ఫ్లాప్స్ అవుతున్నప్పటికీ ఈ బ్యూటీ కి సినిమా అవకాశాలు వరుసగా వస్తున్నాయి. దీంతో ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాలో పనిలో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు సినిమాలు మరొకవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.

ఈ క్రమంలోనే  తనకి సంబంధించిన కొత్త ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో ఒక బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు గా తెలుస్తోంది. స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశాన్ని పూజా హెగ్డే అందుకున్నట్లు గా సమాచారం. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈమె. అంతేకాదు టాలీవుడ్ లో ఉన్న దాదాపుగా అందరూ టాప్ హీరోలతో జతకట్టింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సరసన 'దేవా' అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

రోషన్ ఆండ్రూస్ ఈ యాక్షన్ థ్రిల్లర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే లేటెస్టుగా మరో హిందీ సినిమా ఆఫర్ పూజా చేతికి వచ్చింది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రముఖ హిందీ నటుడు సునీల్ శెట్టి వారసుడు అహన్ శెట్టి హీరోగా 'సంకీ' అనే సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ సాజిద్ నడియాడ్వాలా నిర్మించనున్న చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..  గత కొంత కాలం నుంచి పూజా హెగ్డే కి సౌత్ లో కలసి రావడం లేదు. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: