చిక్కుల్లో గామి.. విపరీతమైన నెగటివిటీ?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా మార్చి 8వ తేదీన విడుదలైంది.డైరెక్టర్ విద్యాధర్ చాలా కాలం పాటు కష్టపడి గామి సినిమాను తెరకెక్కించారు. ఆరేళ్లపాటు షూటింగ్ జరిగిన ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించగా.. అభినయ లీడ్ రోల్ పోషించింది. అడ్వెంచరెస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో మనిషి స్పర్శ తట్టుకోలేని అఘోర పాత్రలో నటించి అదరగొట్టారు విశ్వక్ సేన్.ఇక ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుందీ మూవీ. ఫలితంగా ఈ సినిమా ఇప్పుడు మంచి వసూళ్లని రాబడుతోంది.భారీ ఓపెనింగ్స్ సాధించిన గామి సినిమా రెండో రోజు కూడా సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. రెండు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.15.1 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ గామి సినిమా వీకెండ్‌ లో కూడా తన స్టామినా చూపించడం పక్కా అని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. యూఎస్ ఏలో గామి.. అతి త్వరలోనే హాఫ్ మిలియన్ మార్క్ కూడా ఈజీగా చేరుకుంటుందని చెబుతున్నారు.ఇక ఈ మూవీలో విజువల్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని ఆడియన్స్ పాజిటివ్ గా రియక్ట్ అవుతున్నారు.


తెలుగు సినిమాల్లో ఇప్పటి దాకా ఇలాంటి విజువల్స్ ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. కొన్ని సీన్లు అయితే హాలీవుడ్ స్టైల్ లో ఉన్నాయనే కామెంట్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. విశ్వక్ సేన్ ప్రయోగానికి హ్యాట్సాఫ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొత్త డైరెక్టర్ అయినా సినిమా టేకింగ్ లో వావ్ అనిపించారని చూసిన వారు అంటున్నారు. ఈ మూవీని వి సెల్యూలాయిడ్ సమర్పణలో క్రౌడ్ ఫండింగ్ తో కార్తీక్ శబరీష్ నిర్మించారు. నరేష్ కుమారన్ సంగీతం అందించిన ఈ మూవీలో అభినయతోపాటు మహ్మద్‌ సమద్‌, దయానంద్‌ రెడ్డి, హారిక, శాంతి రావు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీపై ఓ ఫేక్ బ్యాచ్ బుక్ మై షోలో ఫేక్ రేటింగ్ ఇస్తూ నెగటివిటీ పెంచుతుంది. గతంలో విజయ్ దేవరకొండకి కూడా ఈ సిట్యుయేషన్ ఎదురైంది. అందువల్ల విజయ్ బాగా డౌన్ అయిపోయాడు. అలాగే మహేష్ బాబు గుంటూరు కారంపై కూడా ఫేక్ బ్యాచ్ నెగటివ్ రివ్యూలు ఇచ్చి రెచ్చిపోయింది. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు ఈ బ్యాచ్ పప్పులు ఉడకలేదు. మహేష్ కి ఉన్న స్టామినా వల్ల నెగటివ్ టాక్ తోనే గుంటూరు కారం భారీ వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: