ఆ టైమ్ లో నన్ను ఎంతో మంది ధనికులు పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించారు... శిల్పా శెట్టి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ఇప్పటికి కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ బ్యూటీ కేవలం హిందీ సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించింది. అందులో కొన్ని మూవీ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి.

ఇకపోతే ఈ నటి ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అందాలను ఆరబోసి తన గ్లామర్ షో తో కూడా ప్రేక్షకులను అలరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే శిల్పా శెట్టి చాలా సంవత్సరాల క్రితమే ప్రముఖ వ్యాపార వేత్త అయినటువంటి రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీరి సంసార జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగిస్తుంది. ఇకపోతే గత కొంత కాలంగా శిల్పా శెట్టి వ్యాపార వేత్త అయినటువంటి రాజ్ కుంద్రాను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అని విమర్శలు వస్తున్నాయి.

దానితో ఈ బాలీవుడ్ బ్యూటీ ఆ విమర్శలను కొట్టి పారేశారు ... నేను రాజ్ ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. అతను అంటే ఇప్పటికే నాకు ఎంతో ఇష్టం. నేను డబ్బు కోసం అతడిని పెళ్లి చేసుకున్నాను అని కొంత మంది విమర్శలు చేస్తున్నారు. నేను రాజ్ ను పెళ్లి చేసుకునే కంటే ముందు ఆయన కంటే డబ్బు ఉన్న ధనికులు ఎంతో మంది నాకు పెళ్లి ప్రపోజ్ చేశారు. అయినప్పటికీ నేను వాటిని తిరస్కరించి రాజ్ ను పెళ్లి చేసుకున్నాను. నా జీవితంలో డబ్బు ఎప్పుడూ నిర్ణయాలను ప్రభావితం చేయలేదు అని శిల్పా శెట్టి తాజాగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ss

సంబంధిత వార్తలు: