చిరు, బాలయ్య, వెంకీలకు హిట్స్ ఇచ్చి.. నాగార్జునకు మాత్రం ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

praveen
సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి సక్సెస్ వస్తుంది అని ఊహించడం చాలా కష్టం. ప్రతి సినిమా సక్సెస్ అవుతుందనే దర్శక నిర్మాతలు బలంగా నమ్ముతూ ఉంటారు. కానీ చివరికి ఫలితం ఏంటి అన్నది మాత్రం తేల్చేది కేవలం ప్రేక్షకులు మాత్రమే. ఇక మహా మహా స్టార్ హీరోలు సైతం కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకులను ఆకట్టుకోలేక నిరాశ పరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఎవరైనా హీరో దర్శకుడు కాంబినేషన్లో సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది అంటే చాలు ఇక ఆ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి. మరోసారి ఇదే కాంబోలో సినిమా వస్తే బాగుండు అని అభిమానులు అందరూ కూడా కోరుకుంటూ అని చెప్పాలి.

 ఇక అందరూ కోరుకున్నట్లుగానే ఇలాంటి సక్సెస్ఫుల్ కాంబో రిపీట్ అయితే ఇక ఆనందానికి అస్సలు అవధులు ఉండవు. అయితే ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో 90వ దర్శకంలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు అందరూ కూడా ఇలాంటి కాంబోలు వరుసగా రిపీట్ చేస్తూ ప్రేక్షకులను అలరించారు. అయితే చాలామంది దర్శకులు ఇక ఈ స్టార్ హీరోలు అందరితో సినిమాలు తీసి సూపర్ హిట్లు కొట్టారు అని చెప్పాలి. అయితే టాలీవుడ్ లో నాలుగు మూల స్తంభాలు అన్నట్లుగా పేరు సంపాదించుకున్న నాగర్జున, వెంకటేష్, బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలలో ముగ్గురితో సినిమాలు తీసిన హిట్టు కొట్టిన ఒక దర్శకుడు.. నాగార్జున తో మాత్రం హిట్టు కొట్టలేకపోయాడు.

 ఆదర్శకుడు ఎవరో కాదు బి.గోపాల్. నేటి జనరేషన్లో అటు బోయపాటి సినిమాలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ఇక 90 లలో బి.గోపాల్ సినిమాలకు అదే రేంజ్ లో గుర్తింపు ఉండేది  అయితే వరుసగా బాలయ్య బాబుతో సినిమాలు తీసి ఎన్నో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నారు బి గోపాల్. దీంతో మాస్ డైరెక్టర్గా ఆయనకు మంచి పేరు వచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవితో స్టేట్ రౌడీ, ఇంద్ర లాంటి సినిమా తీసి బ్లాక్ బస్టర్ లను కొట్టాడు. బాలయ్యతో రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హీట్లను కూడా తీశాడు.. వెంకటేష్ కి బొబ్బిలి రాజా సినిమాతో ఆల్ టైం ఎవర్గ్రీన్ హిట్ అందించాడు. కానీ నాగార్జునకు మాత్రం కలెక్టర్ గారి అబ్బాయి, విజయ్ లాంటి సినిమాలో తీసి చివరికి ఫ్లాప్ అందించాడు. ఇలా ముగ్గురు స్టార్ హీరోలకు హిట్ అందించి నాగార్జునకు మాత్రం హిట్ అందించలేకపోయాడు ఆ డైరెక్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: