చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫుడ్ మెనూ ఇదేనట.. ఆసక్తికర విషయం చెప్పిన సురేఖ?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అంటే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఎందుకంటే ఇక ఇండస్ట్రీ ఎప్పుడు కష్టాల్లో ఉన్న నేనున్నాను అంటూ ఆయన భరోసాగా నిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక అంతకుమించి అటు మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి ఇక టాప్ హీరోలుగా కూడా ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇలా టాప్ హీరోలుగా కొనసాగుతున్న వారి గురించి పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడు అభిమానులు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్న చిరంజీవి పవర్ స్టార్ కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ఆహారపు అలవాట్ల గురించి చిరు భార్య సురేఖ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు.

 ఏకంగా మెగాస్టార్ చిరంజీవి దంపతులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను  సొంత కొడుకు లాగా చూసుకుంటూ ఉంటారు. అలాగే పెంచి ఇక ఇండస్ట్రీకి హీరోగా కూడా పరిచయం చేశారు.  ఇక ఈ విషయాన్ని అటు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు సినిమా ఈవెంట్లలో కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల చిరంజీవి పవన్ కళ్యాణ్ ఆహారపు అలవాటు గురించి చెప్పుకొచ్చారు సురేఖ. చిరంజీవి తినే విషయంలో అస్సలు ఏమీ పట్టించుకోడట. పచ్చడ ఉన్న కూడా ఈ కడుపునిండా తినేస్తూ ఉంటాడట. అందరిలాగా అది కావాలి ఇది కావాలి అని అడుగరట. ఇష్టమైన ఫుడ్ ఉంటేనే తింటాను అని మొండికి వేయడట. ఏది ఉన్న కడుపునిండా ఆరగిస్తాడట మెగాస్టార్ చిరంజీవి.

 అయితే ఇక అన్నయ్య బాటలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆహార విషయంలో ఇలాగే ఉంటాడట. ఏదైనా ఆహారం కావాలని డిమాండ్ చేయడట. అంతే కాదు తనకు నచ్చిన ఆహారం ఉంటేనే తింటాను అని కండిషన్స్ కూడా పెట్టడట. ఏది ఉన్న తినేస్తూ ఉంటాడట పవన్ కళ్యాణ్. అయితే ఇక చిరు తండ్రి మాత్రం మంచి భోజనం ప్రియులు అంటూ సురేఖ చెప్పుకొచ్చారు. అన్ని ప్లేట్లో పెట్టుకుని అన్నింటిని టేస్ట్ చేస్తూ ఎంతో ఇష్టంగా ఆహారాన్ని తింటూ ఉంటారట. ఆయన తినే విధానం చూస్తుంటే సంపూర్ణ భోజనం అంటే ఇలాగే ఉంటుందేమో అని అనిపిస్తుంది అని సురేఖ చెప్పుకొచ్చారు. అయితే పెళ్లయిన కొత్తలో వంట చేయడం వచ్చేది కాదు. కానీ కొన్ని రోజుల తర్వాత నేర్చుకున్నాను అంటూ సురేఖ చెప్పుకొచ్చింది. ఇక తనకు వంట నేర్పించిన గురువు చిరంజీవి గారే అంటూ తెలిపింది సురేఖ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: